Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్ర ఉపరితలంపై ఏర్పడే గాలుల దిశ, ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం కూడా ఉందనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది తీవ్రమైన తుఫానుగా మారుతుందా లేదా సాధారణ అల్పపీడనంగానే మిగిలిపోతుందా అనే విషయంపై మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది.
ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై ఏ విధంగా ఉంటుందనే దానిపై ప్రజల్లోనూ, రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రసుతం వీస్తున్న గాలుల దిశ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపునకు ఉన్నట్లు వాతావరణ నిపుణులు గమనించారు. రాబోయే 24 గంటల కాలం ఈ అల్పపీడన గమనాన్ని అంచనా వేయడంలో చాలా కీలకమైనది. గాలుల వేగం, తేమ శాతం మరియు సముద్ర మట్టంలో మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ ఈ వ్యవస్థ గమనం మారి కోస్తా ఆంధ్ర వైపునకు తిరిగితే, తీరప్రాంత జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.
Also Read
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
- Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
- Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
ముఖ్యంగా ఏపీ తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు ముందస్తు హెచ్చరికలపై దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే వేటలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. రాబోయే 24 గంటల్లో గాలి మళ్లింపు ఆధారంగా ఈ అల్పపీడన దిశ, తీవ్రతపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. పరిస్థితికి తగినట్లుగా స్థానిక యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Shaji Kumar : షూటింగ్ పూర్తవగానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం!
-
Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..
-
Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
-
Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?