Ramayana Review: రామాయణ మూవీ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Ranbir Kapoor, Yash , Sai Pallavi, Ravi Dubey , Sunny Deol, Kajal Aggarwal
- DIRECTOR: Nitesh Tiwari
- MUSIC: A.R. Rahman
- PRODUCER: Rohan Desai
Ramayana Review: ఇండియన్ సినీ హిస్టరీ లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ గా రామాయణ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్ చేసిన రోజు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా టీమ్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. సౌత్ నుంచి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి వంటి యాక్టర్స్‌తో పాటు, యష్ లాంటి ప్రామిసింగ్ సింగ్ హీరో కూడా రావణుడి పాత్రలో నటించడంతో ఈ సినిమాపై సౌత్‌లో కూడా భారీ అంచనాలున్నాయి. మరి ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
రామాయణ పార్ట్ వన్ కథ
తమ రాక్షస జాతి మీద జరుగుతున్న అవమానాలను అంతమొందించడానికి, తాను రాక్షస రాజుగా మారి దేవతలందరికీ బుద్ధి చెప్పాలని రావణుడు (యష్) బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసిన అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ అతనికి వరం ఇస్తాడు. ఆ వరం ప్రకారం, మానవులు తప్ప అతన్ని ఎవరూ అంతమొందించలేరు. ఆ వర ప్రభావంతో ఇంద్రాది దేవతలందరినీ భయపెట్టి, ముల్లోకాలను తానే ఏలుతూ ఉంటాడు రావణుడు. తనకు ఎదురే లేదని విర్రవీగుతున్న అతన్ని ఆట కట్టించడానికి ఇంద్రుడు కొంతమంది ఋషుల సాయం కోరితే, విష్ణువుని ప్రార్థించాలని చెబుతారు. ఈ క్రమంలోనే విష్ణువు అభయమిస్తాడు. రావణుడిని అంతం చేయడానికి విష్ణువు రాముడి అంశతో దశరథ మహారాజు నలుగురు కొడుకులలో ఒకడిగా జన్మిస్తాడు. ఆ తర్వాత రాముడు (రణబీర్ కపూర్) పెరిగి పెద్దవాడవడం, జనకుడి కుమార్తె సీతాదేవి (సాయి పల్లవి)ని వివాహమాడటం అంటూ సాగిపోతుంది. రావణాసురుడి సోదరి శూర్పణఖ (రకుల్ ప్రీత్ సింగ్) రాముడిపై మనసు పారేసుకోవడం, ఆ తర్వాత జరిగిన అవమాన భారంతో రావణాసురుడు సీతాదేవిని అపహరించడంతో మొదటి భాగాన్ని ముగించారు.
Also Read
విశ్లేషణ
రామాయణం సినిమాగా చేస్తున్నారు అనగానే సాధారణంగానే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఎందుకంటే, రామాయణాన్ని భారతదేశంలో దాదాపు సింహభాగం ప్రజలు పురాణంగా భావిస్తారు. రాముడిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఇలాంటి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచీ ఏర్పడిన అంచనాలను ప్రమోషనల్ కంటెంట్ మరింత పెంచుతూ వెళ్లింది. ఇక సినిమా ప్రారంభమే రావణుడి ఎంట్రీతో మొదలుపెట్టారు. ఇది కాస్త ఇబ్బందికరమైన అంశమే అనిపించినా, అసలు రాముడి జన్మానికి బీజం ఎక్కడ పడింది అనే పాయింట్ చుట్టూనే కథ తిరుగుతూ ఉంది కాబట్టి, రావణాసురుడి ఇతివృత్తాన్ని చూపించి, ఆ తర్వాత పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఆసక్తికరంగా చూపించారు. నిజానికి, ఈ సినిమాలో దాదాపు అన్ని సీన్స్ కూడా VFX షాట్స్‌తో కూడుకున్నవే. ఆ VFX కోసం భారీగానే ఖర్చు పెట్టిన ఫీలింగ్ తెరమీద కనిపించింది. సినిమా సాగుతున్నంత సేపు ఎక్కడా రియాలిటీకి దూరంగా ఉన్న ఫీలింగ్ అయితే కలగలేదు.
రాముడి జననం, ఆ తర్వాత రాముడి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు, రాముడికి సీతకి మధ్య స్వయంవరం, ఆ తర్వాత రాముడి కోసం సీత వనవాసానికి వెళ్లడం అంటూ ఎక్కువగా లాగ్ చేయకుండా, వీలైనంత త్వరగా అసలు రామాయణం అంటే ఏమిటో కూడా తెలియని వారికి ఈజీగా అర్థమయ్యేలా కథను నడిపించే ప్రయత్నం చేశారు. అది చాలా వరకు వర్కౌట్ అయ్యింది కూడా. ఇక జటాయువు ఎపిసోడ్‌తో పాటు, రావణాసురుడు సీతను అపహరించే ఎపిసోడ్లను ఆసక్తికరంగా రాసుకున్నారు. కాకపోతే, ఇంకా ఏదో ఉంటుందని ఆశించే ప్రేక్షకులకు మాత్రం కాస్త నిరాశ కలిగించారని చెప్పొచ్చు. ఎందుకంటే, హనుమంతుడి ఎంట్రీ ఈ మొదటి భాగంలో లేదు. సెకండ్ పార్ట్‌లో ఉండబోతుందంటూ హింట్‌ను సినిమా చివర్లో పోస్ట్ క్రెడిట్స్‌లో ఇవ్వడం జరిగింది.
కాబట్టి, మొదటి భాగం రామాయణాన్ని సెకండ్ పార్ట్ రామాయణం కోసం వేసుకున్న ఒక సాలిడ్ బేస్మెంట్గానే చూడాలి. ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలానే చాలా వరకు సీన్స్ మొదటి భాగంలో ఉన్నాయి. అయితే, సినిమా నిడివిని కొంతవరకు తగ్గించే అవకాశం ఉన్నా, ఎందుకో మేకర్స్ మాత్రం మూడు గంటల పదిహేను నిమిషాల నిడివితోనే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగలేదు. ఆ ఫీలింగ్ రాకుండా చూసుకోవడంలో టీం సక్సెస్ అయ్యింది. VFX షాట్స్ కూడా ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. సినిమాకి తగ్గట్టుగా కరెక్టుగా సెట్ అయ్యాయి. ముఖ్యంగా కొన్ని యుద్ధ సన్నివేశాలు బాగా కుదిరాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, రణబీర్ కపూర్ రాముడిగా కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. ఆ పాత్రలో సటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సీతగా సాయి పల్లవి కూడా ఆకట్టుకుంది. లక్ష్మణుడిగా రవి దూబె కూడా తనదైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక రావణుడిగా యష్ ఎంతలా సెట్ అయ్యాడంటే, ఆ పాత్రలో ఇంకెవరినీ ఊహించుకోలేమన్నంతగా ఇమిడిపోయి నటించాడు. అరుణ్ గోవిల్, శోభన వంటి వాళ్లు తమ సీనియారిటీతో స్క్రీన్ మీద సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు.
‘రామాయణ’ సినిమా సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒక విజువల్ వండర్‌గా నిలిచింది. డినెగ్ (DNEG) స్టూడియోస్ అందించిన అద్భుతమైన యానిమేషన్, జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వింత జీవులు, రాక్షసులు, భారీ వరల్డ్ బిల్డింగ్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. రావణుడి ఎంట్రీ, క్లైమాక్స్ జటాయువు పోరాటం, శూర్పణఖ ఎపిసోడ్‌లోని రాక్షసుల ఫైట్ లాంటి యాక్షన్ సీక్వెన్సెస్‌లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) టాప్-నాచ్గా ఉన్నాయి. వీటికి తోడుగా లెజెండరీ సంగీత దర్శకులు ఏ.ఆర్. రెహమాన్ అండ్ హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ప్రతి సన్నివేశాన్ని వరల్డ్ క్లాస్ సినిమాటిక్ అనుభవంగా మలిచింది. మొత్తంమీద భారతీయ పౌరాణిక గాథను హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో తెరకెక్కించడంలో సాంకేతిక బృందం పూర్తి విజయం సాధించిందనే చెప్పాలి.
ఇక ఫైనల్లీ రామాయణ పార్ట్ వన్ ఫ్యామిలీస్ తో చూడదగ్గ మూవీ.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Explainer: గే, ట్రాన్స్జెండర్ల దూకుడు.. రెయిన్బో సునామీలో ట్రంప్ గల్లంతు!
-
Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
-
Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
ట్రెండింగ్
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!