OTR : ఇక జిల్లాల బాట పట్టనున్న రేవంత్.. సంక్రాంతి తర్వాత పొలిటికల్ దూకుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ క్లారిటీ వచ్చేసిందా? ఎవరో వస్తారని…. ఏదో మేలు చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోవడం టైం వేస్టని డిసైడయ్యారా? అందుకే నేరుగా తానే రంగంలోకి దిగేయాలని డిసైడయ్యారా? అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయి ఇక పని ప్రారంభించడమే మిగిలి ఉందా? ఇంతకీ…. అంతలా ప్రభావితం చేసే ఏం నిర్ణయం తీసుకున్నారు రేవంత్? ఆ ముహూర్తం ఏది? మనం చేసిన మంచిని… ఎవరో ప్రచారం చేస్తారు, ఏదో జరిగిపోతుందని అనుకోవడం వృధా..! అందుకే… మనం చేసిన పని గురించి మనమే చెప్పుకోవాలి. అదీకూడా అందరికీ అర్ధమయ్యేలా వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న మంచి పనులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం లేదన్న ఫీలింగ్‌లో ఉన్నారట ఆయన.
అందుకోసం వాళ్ళని వీళ్ళని నమ్ముకోవడం, ఎవర్నో నిందించడం లాంటి పనులతో కాలం వెళ్ళదీయడం కంటే…నేరుగా తానే రంగంలోకి దిగాలని డిసైనట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికలకు ఇక రెండేళ్ళే సమయం ఉన్నందున ఇప్పట్నుంచి సీరియస్‌గా మొదలుపెడితేనే తన ప్రభుత్వం చేసిన మంచి గురించి ప్రజలు మాట్లాడుకుంటారని భావిస్తున్నారట ఆయన. అందుకే… ఇక నేరుగా తానే రంగంలోకి దిగి ప్రజా బలాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సంక్రాంతి తర్వాత.. జనంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట సీఎం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలతో పాటు ప్రభుత్వ విజన్‌ను ప్రజల ముందు ఉంచడం, సర్కారుపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టడం లాంటివాటికి ఇక నుంచి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టు తెలిసింది.
Also Read
ప్రభుత్వం చేస్తున్న పథకాలకు ఇన్నాళ్ళుగా అంత ప్రచారం రాలేదని, క్యాబినెట్ మంత్రులు కూడా ఎవరి పని వాళ్ళదేనన్నట్టు సైలెంట్‌గా ఉంటున్నారన్న ఫీలింగ్ అధికార పార్టీ వర్గాల్లో ఉందంటున్నారు. అడపాదడపా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్… లేదంటే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రభుత్వ పథకాలు వివరించడంతో పాటు ప్రతిపక్షం నుంచి వచ్చే ఆరోపణలకు కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. ఇన్నాళ్లు అన్ని పథకాల గ్రౌండింగ్ జరుగుతోంది. ఇక నుంచి వీటిని తరచూ పర్యవేక్షిస్తూ… అర్హులైన వారందరికీ అందించాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే సంక్రాంతి పండగ తర్వాత జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టపోతున్నారట సీఎం. ఉమ్మడి జిల్లాల్లోని జిల్లా కేంద్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఒక్కొక్క అంశంపై ఒక్కో చోట సభ నిర్వహించాలని నిర్ణయించారట ముఖ్యమంత్రి. అధికారులతో సమీక్ష సమావేశాలు… పార్టీ వ్యవహారాల దిద్దుబాటులాంటి అంశాలపై ఇక మీదట ఫోకస్ పెరగబోతున్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లో చర్చకు పెట్టడం లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నారాయన. ఇప్పటి నుంచే… వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేయడంతో పాటు ప్రతిపక్షానికి చెక్ పెట్టే ఎత్తుగడలకు పదును పెట్టబోతున్నారన్నది కాంగ్రెస్ ఇంటర్నల్ టాక్. నేరుగా ముఖ్యమంత్రే గ్రౌండ్ లెవల్‌కి వెళ్తే సమస్యలు తెలుసుకోవడంతో పాటు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం కూడా తేలికవుతుందన్నది రేవంత్‌రెడ్డి అభిప్రాయంగా తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే సంక్రాంతి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి దూకుడు పెంచబోతున్నారన్నది పొలిటికల్ టాక్. ప్రభుత్వం మీద పాజిటివిటీ పెంచడం, పార్టీ కేడర్ని యుద్ధానికి సిద్ధం చేయడం లాంటి రెండు పనుల్ని ఏక కాలంలో చక్కబెట్టాలనుకుంటున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి.
తాజావార్తలు
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
CII Summit: విశాఖ వేదికగా ‘సీఐఐ సమ్మిట్–2026’.. ఏపీ పారిశ్రామిక ప్రగతికి నయా రూట్ మ్యాప్..
-
Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
-
OTR: తిరువూరు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. ఫైనల్ పంచ్ ఎవరిది?
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?