Off The Record: విజయనగరం మేయర్ విషయంలో కోలగట్ల తడబాటు.. అతి విశ్వాసంతో మొదటికే మోసం..!
- విజయనగరం మేయర్ విషయంలో కోలగట్ల తడబాటు..
- తన కుమార్తె గెలుపు ఖాయమన్న అతి విశ్వాసంతో మొదటికే మోసం..
- పార్టీ వార్డ్ సభ్యుల్ని పట్టించుకోకుండా మేయర్ కోసం ప్రచారం..
- నా కూతురిని చూడండంటూ శ్రావణి కోసం కోలగట్ల క్యాంపెయిన్..
- కూటమి పార్టీల ఓట్ల బదిలీపై కూడా తప్పిన లెక్కలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామికి విజయనగరం ఓటర్లు గట్టి షాకే ఇచ్చారన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే అది స్వయంకృతమేనని, ఆయన నేల విడిచి సాము చేశారన్న విశ్లేషణలు ఆసక్తి రేపుతున్నాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన కుమార్తె శ్రావణిని మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపారాయన. రాజకీయ సమీకరణలు అనుకూలంగా లేవన్న అభిప్రాయాలు తొలి నుంచే వ్యక్తమైనా.. మేయర్ పీఠం తమదేనన్న ధీమాతో ముందుకు సాగి దెబ్బతిన్నట్టు చెప్పుకుంటున్నారు. వార్డుల్లో వైసీపీకి స్థానాలు తగ్గినా.. మేయర్ అభ్యర్థి గెలుపు ఖాయమన్న అంచనాల్లో ఉన్నారట ఆయన. కూటమి బలాన్ని, స్థానిక రాజకీయ పరిణామాలను తక్కువగా అంచనా వేయడం, తన రాజకీయ అనుభవం గురించి ఎక్కువగా ఊహించుకోవడం లాంటి కారణాలే కోలగట్లను దెబ్బ కొట్టాయని అంటున్నారు. అప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా… వార్డుల్లో పార్టీ అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓట్లు అడుగుతుంటే.. కోలగట్ల వర్గం మాత్రం వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… మేయర్‌గా శ్రావణిని గెలిపించాలని ప్రచారం చేసిందని, అదే పూర్తిగా రివర్స్ అయినట్టు చెప్పుకుంటున్నారు. రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ, స్థానిక ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తుంటారు స్థానిక అభ్యర్థులు.
కానీ మేయర్ అభ్యర్థి గెలుపు కోసం లోకల్ క్యాండిడేట్‌ను పక్కన పెట్టారన్న భావన కలిగితే…. కచ్చితంగా దానివల్ల ఇద్దరికీ నష్టం జరుగుతుంది. కోలగట్ల శ్రావణి విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు. నా కూతురిని చూడండంటూ ఎన్నికల ప్రచారంలో వీరభద్రస్వామి ఇచ్చిన సందేశం…. స్థానిక అభ్యర్థికి ఓటేయమన్న అభ్యర్థనను వెనక్కి నెట్టిందన్న చర్చ ఇప్పుడు విజయనగరం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. మేయర్ అభ్యర్థి కోసం పార్టీ మొత్తం పనిచేయాల్సిందే. కానీ…. అదే సమయంలో డివిజన్స్‌లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా సమానమైన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే, ఈ లాజిక్ మిస్ అయ్యే.. కోలగట్ల పన్నిన వ్యూహం బెడిసి కొట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మేయర్ అభ్యర్థి గెలుపును ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో.. వార్డుల్లో స్థానిక నాయకుల అసంతృప్తి, క్యాడర్లో ఉన్న విభేదాలు స్వామిని చుట్టుముట్టాయట. ఆ క్రమంలో…ఎవరికి వారు పార్టీ అన్న సంగతి మర్చిపోయి నేను గెలిస్తే చాలన్నట్టు పనిచేయడం వోవరాల్‌గా మేయర్ అభ్యర్థి మీద ప్రభావం చూపిందని అంటున్నారు. అటు కూటమి రాజకీయ వ్యూహాలు, మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ లాంటి విషయాల్లో కూడా వైసీపీ అంచనాలు తప్పాయట. మరోవైపు కోలగట్ల చుట్టూ ఉన్న కొందరు నాయకులే ఆయనకు వాస్తవ పరిస్థితులను వివరించకుండా.. అనుకూల నివేదికలు ఇచ్చారన్న విమర్శలు కూడా సొంత పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతా బాగుందని చెప్పడం.. స్థానిక నాయకుల అసంతృప్తిని పట్టించుకోకపోవడం.. వాటన్నిటికీ మించి వోవర్ కాన్ఫిడెన్స్ లాంటివన్నీ కలగలిసి పార్టీ గెలుపు మీద దెబ్బేశాయని విశ్లేషిస్తున్నారు విజయనగరం వైసీపీ నాయకులు.
Also Read
- Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
- Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
- Off The Record: నెల్లూరు జడ్పీ పీఠంపై టీడీపీలో అసంతృప్త రాగాలు.. అన్నీ వాళ్ళ కోటాకేనా అంటూ అసహనం
- OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్!
డివిజన్స్‌లో పోటీ చేసే నాయకులు తమ గెలుపు కోసం కష్టపడుతున్న సమయంలో.. మేయర్ అభ్యర్థి గెలుపుపై మాత్రమే వీరభద్రస్వామి ఎక్కువగా దృష్టి పెట్టడం వారిలో అసంతృప్తి రేపిందట. మేయర్ అభ్యర్థి కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయడం వల్ల ఏర్పడిన రాజకీయ వైరుధ్యం పార్టీకి నష్టం కలిగించిందని అంటున్నారు. కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పనిచేయాల్సిన సమయంలో.. వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యాలు ముందుకు రావడం పార్టీ క్యాడర్లో సమన్వయాన్ని దెబ్బతీసిందన్నది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో టాక్. మేయర్ అభ్యర్థి గెలుపు కోసం డివిజన్ నాయకులను ఉపయోగించుకోవడం ఒక వ్యూహం. కానీ… వాళ్ళని వదిలేసి డైరెక్ట్‌గా మేయర్ మీదే ఫోకస్ చేయడమంటే నేల విడిచి సాము చేయడమేనన్న అభిప్రాయం బలంగా ఉంది. అంత అనుభవం ఉండి కూడా…. మాజీ డిప్యూటీ స్పీకర్ చేసిన ఆ తప్పువల్ల ఆయన భారీ మూల్యమే చెల్లించుకున్నారన్నది లోకల్ పొలిటికల్ అనాలసిస్. మేయర్ గెలుపుపై అతిగా నమ్మకం, డివిజన్స్‌లో కార్పొరేటర్ అభ్యర్థుల ప్రాధాన్యాన్ని విస్మరించడం, స్థానిక నాయకుల అసంతృప్తి.. కూటమి రాజకీయ వ్యూహాలను తక్కువగా అంచనా వేయడంలాంటివన్నీ కలగలిసి డాటర్ ఆఫ్ వీరభద్రస్వామికి డ్యామేజ్ చేశాయంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తాజావార్తలు
-
Drug Racket: హైదరాబాద్‌లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
-
Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! ‘రామాయణ’ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
-
Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
-
CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!