Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగార్థులకు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 పరీక్షకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అధికారికంగా జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు నేటి నుంచే ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించారు.
వివరాల్లోకి వెళ్తే.. మొదట ప్రకటించిన ఖాళీల సంఖ్యను ఇప్పుడు కొద్దిగా పెంచారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 686 నుంచి 720కి పెరిగింది. ఇందులో మొత్తం 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండగా, మరో 249 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగాలలో 203 డిప్యూటీ తహసిల్దార్ పోస్టులు, 176 డిప్యూటీ ఎంపీడీవో (MPDO) పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు జీఎస్టీ (GST) ఆఫీసర్లు 40, ఎక్సైజ్ ఎస్ఐ (SI) పోస్టులు 29 వరకు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
Also Read
- Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..
- IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..
- Aaryavir Sehwag: బ్యాటింగ్‌లో వీరవిహారం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ప్రపంచంలో సరికొత్త రికార్డు..
- Cloud Kitchens: క్లౌడ్ కిచెన్లలో ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? తనిఖీల్లో మొత్తం బొద్దింకలు, పురుగులే..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు నేటి నుంచి https://portal-psc.ap.gov.in/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 11వ తేదీని తుది గడువుగా అధికారులు నిర్ణయించారు. గడువు ముగిసేలోగా అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
-
Mouli : ‘దొంగ నా కొడకు’ టైటిల్‌పై సెన్సార్ కత్తెర.. ‘DNK’ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!
-
CM Revanth Reddy : పది మంది డీఎస్పీలు చాలు.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచినా, తగ్గించినా
-
Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..
-
IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?