AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: పండుగలు, సెలవులు వచ్చాయంటే.. సొంత ఊరు వెళ్లడానికో.. నచ్చిన ప్రదేశాలను చూసేందుకు ప్రయాణాలు పెరుగుతుంటాయి.. అయితే, ఇదే అదునుగా భావించి.. ప్రయాణికుల ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పండుగలు, సెలవు రోజుల్లో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచడాన్ని నియంత్రించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రైవేట్ బస్సుల ప్రయాణ ఛార్జీల నియంత్రణకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు వసూలు చేసే గరిష్ట ప్రయాణ ఛార్జీలను నిర్ణయించేందుకు నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని సమర్థంగా అమలు చేయడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలతో పాటు ఇతర సెలవు రోజుల్లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల అనుమతులు, బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర సమాచారాన్ని ఆన్లైన్ యాప్‌లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. తద్వారా ప్రయాణికులకు బస్సుల వివరాలు, వాటి అనుమతులపై పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు.
Also Read
- Cyclone Threat : మురసు, అర్నబ్ తర్వాత మరో అల్పపీడనం.. ఏపీకి టెన్షన్
- Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
- AP MPP, ZPP Indirect Elections 2026: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. MPP, ZPP ఎన్నికల తేదీలు ఖరారు!
- iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!
ఈ పిల్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. పండుగలు, సెలవుల వంటి రద్దీ సమయాల్లో ప్రైవేట్ బస్సుల ప్రయాణ ఛార్జీలను నిర్ణయించే అంశంపై ఎనిమిది వారాల్లోగా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఎనిమిది వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పండుగలు, సెలవు రోజుల్లో ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీల వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందా అనే ఆసక్తి నెలకొంది. మరి, హైకోర్టు ఆదేశాలపై ఏపీ రవాణాశాఖ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Astrology: నవంబర్ 11 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
ట్రెండింగ్
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..