Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. ‘వారణాసి’ థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi Movie Theatrical Rights: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న వారణాసిపై ఏ చిన్న న్యూస్ వచ్చినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. సినిమా బిజినెస్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.290 కోట్ల భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ డీల్‌కు సంబంధించి చిత్రబృందం లేదా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఒప్పందం నిజమైతే.. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌లో సరికొత్త రికార్డుగా నిలవనుంది. ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.225 కోట్ల ధర పలికింది. వారణాసి థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా పోటీపడ్డాయని.. చివరకు మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
Also Read
- Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
- Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! 'రామాయణ'ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
- DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
- Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
మహేశ్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ స్థాయి కథాంశం, భారీ నిర్మాణ విలువలు, స్టార్ కాస్ట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ నేపథ్యంలో సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ వార్తతో మహేశ్ బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పటివరకు వారణాసి నుంచి కొన్ని స్టిల్స్, ఓ గ్లింప్స్ మాత్రమే వచ్చాయి. దీంతో మేజర్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నవంబర్‌లో వారణాసి నుంచి మరో భారీ రివీల్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. ‘వారణాసి’ థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
-
Onion Prices: సామాన్యుడి కంట కన్నీరు.. భగ్గుమంటున్న ఉల్లి ధరలు..!
-
Srisailam Karthika Mahotsavam: కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
-
Suryakumar Yadav: మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు.. సూర్యకుమార్‌కు ముంబై పగ్గాలు..!
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
ట్రెండింగ్
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!