RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్?.. పాత చెక్‌బుక్‌లపై RBI కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Fact Check: భారత్ లో జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న చెక్‌బుక్‌లను డిసెంబర్ 31, 2026 తర్వాత మార్చుకోవాల్సి ఉంటుందని, వాటి స్థానంలో మరింత మెరుగైన భద్రతా ప్రమాణాలతో కూడిన కొత్త చెక్‌బుక్‌లను బ్యాంకులు అందించనున్నాయని కొన్ని సందేశాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న చెక్‌బుక్‌ల విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని RBI స్పష్టం చేసింది. కొత్త చెక్‌బుక్‌లు తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను కూడా ప్రకటించలేదని వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది.
కొత్త చెక్‌బుక్‌లు తప్పనిసరిగా మార్చుకోవాలా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశాల ప్రకారం.. 2026 డిసెంబర్ 31 తర్వాత ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్టాండర్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) చెక్‌బుక్‌లు చెల్లవని, 2027 జనవరి 1 నుంచి కొత్త భద్రతా ఫీచర్లతో కూడిన చెక్‌బుక్‌లు అమల్లోకి వస్తాయని ప్రచారం జరిగింది. దీంతో ఖాతాదారులు తమ పాత చెక్‌బుక్‌లను మార్చుకోవాల్సి ఉంటుందనే ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రచారాన్ని RBI పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న CTS చెక్బుక్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది.
Also Read
- Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
- Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ మార్పు.. ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త సెటిల్మెంట్ రూల్స్..!
సోషల్ మీడియా ‘X’ వేదికగా RBI వివరణ
ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న స్టాండర్డ్ CTS చెక్‌బుక్‌లు 2026 డిసెంబర్ 31 నుంచి మారిపోతాయని, 2027 జనవరి 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలతో కూడిన చెక్‌బుక్‌లు అందుబాటులోకి వస్తాయని సోషల్ మీడియాలో ఒక సందేశం ప్రచారంలో ఉందని RBI పేర్కొంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. CTS చెక్‌బుక్‌లకు సంబంధించి ప్రస్తుతం RBI అలాంటి ఎలాంటి మార్పులను చేపట్టడం లేదని వెల్లడించింది.
పాత చెక్‌బుక్‌ల పరిస్థితి ఏమిటి?
RBI ఇచ్చిన స్పష్టత ప్రకారం.. ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న CTS చెక్‌బుక్‌లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. 2026 డిసెంబర్ 31 తర్వాత పాత చెక్‌బుక్‌లు చెల్లవనే ప్రచారానికి ఎలాంటి అధికారిక ఆధారం లేదు. అందువల్ల కొత్త చెక్‌బుక్‌ల కోసం బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం లేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. బ్యాంకింగ్ సేవలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మవద్దని RBI ప్రజలకు సూచించింది. ముఖ్యంగా చెక్‌బుక్‌లు, బ్యాంకింగ్ నిబంధనలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మార్పులపై సమాచారం తెలుసుకోవాలంటే RBI అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరింది.
It has come to the notice of the Reserve Bank of India that a message is circulating on social media claiming that the standard Cheque Truncation System (CTS) cheque books currently in use will change from December 31, 2026 and the new cheque books featuring updated security standards will come into effect from January 1, 2027.
It is clarified that at present Reserve Bank of India is not introducing any such measures with regard to the CTS cheque books. As such, the message is factually incorrect and misleading.
Members of public are requested to rely only on the information published by RBI from time to time in such matters.
— ReserveBankOfIndia (@RBI) November 7, 2026
తాజావార్తలు
-
RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్?.. పాత చెక్‌బుక్‌లపై RBI కీలక ప్రకటన
-
Nvidia CEO Controversy: ‘నేను నా భార్యకు ద్రోహం చేశాను,’.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
-
Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్‌కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
ట్రెండింగ్
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..