Priya Bhavani Shankar : రహస్యంగా ఎగేజ్మేంట్ చేసుకున్న ఇరుముడి హీరోయిన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నటి ప్రియా భవాని శంకర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాలేజీ రోజుల నుంచే రాజ్ వేల్ అనే వ్యక్తితో గాఢ ప్రేమలో ఉన్న ప్రియా, ఆయనతో కలసి ఉన్న సరికొత్త ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా, అందులో వారిద్దరి మెడలో మల్లెపూల దండలు ఉండటం, వెనుక నేపథ్య సంగీతంగా మంగళ వాయిద్యాలు, శుభసూచకమైన పెళ్లి గీతాలు వినిపిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందని, త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జోరందుకుంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్కసారిగా ఇలాంటి విజువల్స్ బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి, బుల్లితెర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా, ‘మేయాద మాన్’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కడైకుట్టి సింగం’, ‘మాన్స్టర్’, ‘తిరుచిత్రంబలం’, ‘భారతీయుడు 2’, ‘డిమాంటీ కాలనీ 2’ వంటి వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్గా స్థిరపడ్డారు. ఇటీవల ఆమె నటించిన ఇరుముడి తెలుగు సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఏకంగా 250 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. కెరీర్ అత్యున్నత దశలో ఉన్న తరుణంలోనే ప్రియా తన చిరకాల ప్రియుడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవ్వడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ నిశ్చితార్థంపై ప్రియా భవాని శంకర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Yash : పిల్లలతో రావణాసురుడి గెటప్‌లో పిక్స్ షేర్ చేసిన యష్
- Shaji Kumar : షూటింగ్ పూర్తవగానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం!
- Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
తాజావార్తలు
-
Priya Bhavani Shankar : రహస్యంగా ఎగేజ్మేంట్ చేసుకున్న ఇరుముడి హీరోయిన్?
-
Yash : పిల్లలతో రావణాసురుడి గెటప్‌లో పిక్స్ షేర్ చేసిన యష్
-
Indiramma Indlu: రూ.5 లక్షలతో 20 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం!
-
Shaji Kumar : షూటింగ్ పూర్తవగానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం!
-
Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?