Tollywood : మన టాలీవుడ్ ‘పాన్ ఇండియా’ హీరోలు ఎంత సేఫ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ముంబైలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదృష్టవశాత్తూ ఆయన ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడటం అందరికీ ఊరటనిచ్చినా, ఈ సంఘటన సినీ పరిశ్రమలో భద్రతపై అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న మన టాలీవుడ్ స్టార్ హీరోల భద్రత విషయంలో ఇప్పుడు తీవ్రమైన చర్చ సాగుతోంది. ఒకప్పుడు మన హీరోల ప్రమోషన్స్, ఈవెంట్స్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. మన స్టార్స్ పాన్ ఇండియా ఐకాన్స్‌గా మారారు. సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై, ఢిల్లీ, పాట్నా, యూపీ వంటి ఉత్తరాది ప్రాంతాలకు తరచుగా వెళ్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎవరి మనోభావాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దెబ్బతింటాయో ఎవరూ ఊహించలేరు. ఏ చిన్న విషయమైనా వివాదంగా మారి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లేటప్పుడు మన హీరోలు కేవలం ప్రైవేట్ సెక్యూరిటీ మీద ఆధారపడకుండా, కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరోవైపు హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్లలో కూడా భద్రతా ప్రమాణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. మన దగ్గర గన్ కల్చర్ లేదనే ధీమాతో ఉంటున్నాం. భారీ పబ్లిక్ ఈవెంట్లకు హీరోలు వస్తున్నప్పుడు వారి చుట్టూ కేవలం బౌన్సర్లు మాత్రమే ఉంటున్నారు. ఒకవేళ ఎవరైనా దురుద్దేశంతో, పక్కా ప్లాన్‌తో గన్ లేదా కత్తులు లాంటి ఆయుధాలతో వస్తే.. ఈ బౌన్సర్లు వారిని ఏం చేయగలరు? కేవలం కండలు తిరిగిన దేహాలు ఆయుధాలను, బుల్లెట్లను ఆపలేవు కదా! వందల కోట్ల వ్యాపారానికి మూలస్తంభాలైన హీరోల భద్రతను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. ఈ కాల్పుల ఘటనను ఒక హెచ్చరికగా భావించి సినీ నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్లు తక్షణమే అప్రమత్తం కావాలి. ప్రభుత్వాలు కూడా పాన్ ఇండియా క్రేజ్ ఉన్న స్టార్ హీరోలకు సరైన భద్రతా వలయాన్ని కల్పించే దిశగా పునరాలోచించాలి. ఏదైనా జరగరానిది జరిగాక బాధపడే కంటే, ముందే పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం ఉత్తమం.
Also Read
తాజావార్తలు
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
-
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!