Scene Review: సూర్య ‘సీన్’ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: సూర్య, నజ్రియా నజీమ్, నస్లేన్, ఆనంద్‌రాజ్, లాల్, టొవినో థామస్ (అతిథి పాత్ర) తదితరులు
- DIRECTOR: జీతూ మాధవన్
- MUSIC: సుశీన్ శ్యామ్
- PRODUCER: సూర్య, జ్యోతిక
Scene Review: సూర్య హీరోగా జీతూ మాధవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు అనే అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు, సినిమాలో చాలా కాలం తర్వాత నజ్రియా హీరోయిన్గా నటిస్తుండటంతో పాటు, నస్లెన్ తొలిసారిగా తమిళ సినీ రంగంలో డెబ్యూ చేయడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. దానికి తోడు, ప్రమోషనల్ స్టఫ్ అంతా వర్కౌట్ కావడంతో, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అని సూర్య అభిమానులతో పాటు సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూశారు. మరి, దీపావళి సందర్భంగా ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
సీన్ కథ :
ప్రేమ్‌రాజ్ (సూర్య) ఓ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. తన తెలివితేటలతో ఎన్నో క్లిష్టమైన కేసులను సాల్వ్ చేసే అతను తనకున్న సమస్య కారణంగా తన జాబ్ వదిలేయాలి అనుకుంటాడు. అయితే ఆ సమస్య విక్టర్ (టోవినో థామస్) అనే సీరియల్ కిల్లర్ కారణంగా క్రైమ్ బ్రాంచ్ హెడ్ స్టీఫెన్(లాల్)కు తెలిసిపోతుంది. ప్రేమ్‌రాజ్‌ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అదే టైమ్‌లో సిటీలో ఒకే తరహాలో ఓ కిల్లర్ వరుసగా హత్యలు చేస్తుంటాడు. తనపై వచ్చిన కొన్ని ఆరోపణల కారణంగా పోలీస్ జాబ్ లేకపోయినా ఈ కేసును సాల్వ్ చేస్తానని స్టీఫెన్‌తో ప్రేమ్‌రాజ్ ఛాలెంజ్ చేస్తాడు. ఈ సీరియల్ కిల్లర్ కేసు ఇన్వేస్టిగేషన్ కోసం మాయ (నజ్రియా నజీమ్)ను అసిస్టెంట్ గా జాయిన్ చేసుకుంటాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా హత్యలు చేస్తున్న కిల్లర్ ఈశ్వర్(నస్లెన్)ను ఓ కీలకమైన సమస్యతో బాధపడుతున్న ప్రేమ్‌రాజ్ ఎలా పట్టుకున్నాడు? మాయతో ప్రేమ్‌రాజ్‌కు ఏర్పడిన పరిచయం ఎలా మారింది? అన్నదే ఈ సినిమా కథ.
Also Read
విశ్లేషణ
రెగ్యులర్ కమర్షియల్ ఇమేజ్ ఛట్రం నుంచి బయటకు వచ్చి కొత్తదనంతో కూడిన కథలు, పాత్రలు ఎంచుకోవాలన్న సూర్య ఆలోచన అభినందనీయం. కానీ నటుడి ప్రయోగానికి తగ్గట్టు బలమైన కథ, ఉత్కంఠభరితమైన కథనాలను దర్శకుడు సిద్ధం చేసుకోలేకపోయాడు. సాధారణంగా సీరియల్ కిల్లర్ బేస్డ్ సినిమాల్లో హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్స్, పిల్లి-ఎలుక పోరు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను పంచాలి. కానీ ఇందులో విలన్‌ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ వేసే ఎత్తులు చాలా సిల్లీగా అనిపిస్తాయి. హీరోను ఎలివేట్ చేయడం కోసం చుట్టూ ఉన్న మిగతా పోలీసులను జోకర్లుగా చూపించడం సహజత్వాన్ని దెబ్బతీసింది. ప్రధాన పాత్రలన్నింటికీ ఏదో ఒక బలహీనత లేదా సమస్య ఉన్నట్టు చూపించారు కానీ, వాటి నేపథ్యంపై స్పష్టత లేదు. కథలో పరిస్థితులు అన్నీ హీరోకు అనుకూలంగా మారిపోతుంటాయి. తెలివైన ఇన్వెస్టిగేషన్ మూవీగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించినప్పటికీ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. సినిమాకు ప్రధాన బలం సూర్య నటన మరియు ఆయన చేసిన ప్రయోగం. అంధుడైన పోలీస్ ఆఫీసర్‌గా తన సహజమైన శైలితో, స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. కమర్షియల్ హీరో రోల్ కాక పోయినా తన అనుభవంతో పాత్రకు నిండుదనం తెచ్చాడు. దీనితో పాటు నజ్రియా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, కథలో అక్కడక్కడా వచ్చే హాస్యం కొంతవరకు నవ్వులు పూయించి ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తుంది.. కథలో లాజిక్ లేకపోవడం, సన్నివేశాలు అన్నీ హీరోకు మరీ సౌకర్యవంతంగా అనుకూలించేలా రాసుకోవడం సహజత్వాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా విలన్ పాత్రలో ఏమాత్రం బలం లేకపోవడం వల్ల క్రైమ్ థ్రిల్లర్‌కు అవసరమైన ఉత్కంఠ లోపించింది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే.. ఒక సమస్యతో బాధపడే పోలీస్ ఆఫీసర్‌గా చాలా స్టైలిష్‌గా, జోవియల్ బాడీ లాంగ్వేజ్‌తో అలరించాడు. మాస్ ఎలివేషన్లు, ఫైట్లు, రొమాంటిక్ ట్రాక్‌లకు దూరంగా ఉంటూ ఇలాంటి ప్రయోగాత్మక పాత్రను ఒప్పుకోవడమే పెద్ద సాహసం. తన పాత్రను ఎంతో సహజంగా, అలవోకగా పోషించాడు. సినిమాకు సూర్య నటన మాత్రమే అతిపెద్ద బలం. నజ్రియా నజీమ్ మాయ పాత్రలో క్యూట్ పర్ఫార్మెన్స్తో మెప్పించింది. అయితే, ఆమె పాత్ర ఇంకా బలంగా రాసుకుని ఉండవచ్చు. ఈ పాత్రపై పెంచిన హైప్‌కు తగ్గట్టుగా స్క్రీన్‌పై బలం కనిపించలేదు. సీరియల్ కిల్లర్ పాత్రలో ఉండాల్సిన క్రూరత్వం లేదా ఆధిపత్యం అతనిలో కొరవడింది. ఆనంద్‌రాజ్, లాల్‌లతో పాటు పోలీస్ పాత్రల్లో కనిపించిన కొందరు నటులు అక్కడక్కడా నవ్వించారు. హీరో తల్లిదండ్రుల పాత్రలు అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. అతిథి పాత్రల్లో కనిపించిన జ్యోతిక, టొవినో థామస్ అలరించారు.
సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి చిత్రాలతో డార్క్ కామెడీని అద్భుతంగా పండించిన దర్శకుడు జీతూ మాధవన్, ఈసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. క్రైమ్ థ్రిల్లర్‌లో కామెడీని సరిగ్గా మేళవించలేక, లాజిక్ లేని సన్నివేశాలతో సినిమాను నడిపించాడు. సుశీన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం నిరాశపరుస్తుంది. థ్రిల్లర్ మూడ్ క్రియేట్ చేయాలా లేక కామెడీకి బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వాలా అన్న గందరగోళంలో మ్యూజిక్ తేలిపోయింది. వినీత్ అగస్టీన్ కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 29 నిమిషాలే అయినప్పటికీ, స్క్రీన్‌ప్లేలో సాగతీత వల్ల నిడివి చాలా ఎక్కువైందనే భావన కలుగుతుంది. సగానికి పైగా కథ ఒకే ఇంట్లో నడుస్తుంది.
ఫైనల్లీ సూర్య యాక్టింగ్ కోసం, ఆయన చేసిన ప్రయత్నాన్ని చూడాలనుకునే అభిమానులకు నచ్చొచ్చు కానీ..
తాజావార్తలు
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
-
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!