Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో కొందరు నటీమణుల తీరు చూస్తే.. ‘నీతులు చెప్పేది ఎదుటివారికే, మనం పాటించడానికి కాదు’ అన్నట్లుగా ఉంటుంది. బాలీవుడ్‌కు వెళ్లగానే సౌత్ సినిమాలను, ఇక్కడి కల్చర్‌ను చులకన చేసి మాట్లాడటం కొంతమందికి ఫ్యాషన్‌గా మారిపోయింది. సరిగ్గా ఇలాంటి వ్యవహారంతోనే తాజా వెబ్ సిరీస్‌ను ప్రమోట్ చేసే క్రమంలో తెలుగు సినిమాను ఎగతాళి చేసిన నటి రాధికా ఆప్టే.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. టాలీవుడ్‌పై ఆమె చేసిన కామెంట్స్‌ను, ఇప్పుడు బాలీవుడ్లో ఆమె చేస్తున్న పనులను పోల్చి చూస్తూ ఆమె హిపోక్రసీని నెటిజన్లు ఎండగడుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. “నేను నటించిన ఒక తెలుగు సినిమాలో మేనమామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ కాన్సెప్ట్ నాకు చాలా వింతగా అనిపించింది” అంటూ టాలీవుడ్‌ను, ఇక్కడి కథలను తీవ్రస్థాయిలో ఎగతాళి చేసింది. దక్షిణాదిలో మేనమామను వివాహం చేసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం. కుటుంబ బంధాల నేపథ్యంలో వచ్చే సినిమాల్లో ఇలాంటి కథలు సర్వసాధారణం. కానీ, అది రాధికా ఆప్టేకు మాత్రం చాలా తప్పుగా, ఎబ్బెట్టుగా కనిపించింది. ఆమెకు అది నచ్చక పోయి ఉంటే అప్పుడే చెప్పొచ్చు.
Also Read
- Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న 'ఈ నగరానికి ఏమైంది' కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
- Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
- Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
తెలుగు సినిమాలో మేనమామను పెళ్లాడే సీన్ చేస్తేనే అంతగా గిలగిలలాడిపోయి నీతులు చెప్పిన రాధికా ఆప్టే.. హిందీలో మాత్రం దారుణమైన కంటెంట్ ఉన్న సిరీస్‌లో నటించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. విమర్శకుల నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘అక్క’ (Akka) అనే హిందీ వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఓ కుర్రాడితో ఆమె క్యారెక్టర్ ఎఫైర్ నడుపుతుంది. ఈ సిరీస్‌లో ఒకానొక సన్నివేశంలో ఆ కుర్రాడు రాధికా ఆప్టేతో.. “ఫ్యామిలీ ట్రీ (బంధుత్వం) ప్రకారం చూసుకుంటే.. నేను నీకు మేనల్లుడిని అవుతాను, నువ్వు నాకు ఆంటీవి అవుతావు తెలుసా?” అని అంటాడు. దీనికి రాధికా ఆప్టే క్యారెక్టర్ ఎంతో మత్తుగా, శృంగారభరితమైన టోన్‌లో.. “అయితే ఏంటి? అది నీకు ఇబ్బందిగా అనిపిస్తుందా?” అని సమాధానం ఇస్తుంది. సరిగ్గా ఈ డైలాగ్ దగ్గరే రాధికా ఆప్టే డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు అయ్యాయి. సమాజంలో ఎక్కడా ఆమోదయోగ్యం కాని ‘మేనత్త-మేనల్లుడి’ మధ్య శృంగార సన్నివేశాల్లో నటించడానికి, అలాంటి పచ్చి డైలాగులు చెప్పడానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరాలూ రాలేదు.
పైగా దాన్ని ఒక ‘బోల్డ్’ అటెంప్ట్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ, దక్షిణాదిలో ఒక ఆచారంగా ఉన్న మేనమామ-మేనకోడలి పెళ్లిని సినిమాలో చూపిస్తే మాత్రం ఆమెకు సంస్కారం గుర్తొచ్చేసింది. అయినా నిజానికి ఆమె పేర్కొన్న సినిమాలో ఉన్నది మేన బావ, మేన మరదలు సంబంధం. తన వెటకారం కోసం ఆమె మార్చేసి మారీ సౌత్ సినిమాను ఆమె కామెంట్ చేసింది. ఒకవైపు సాంప్రదాయబద్ధమైన పెళ్లిని చూపిస్తేనే జీర్ణించుకోలేకపోయిన ఈమె, ఇప్పుడు ఏకంగా వరుసకు మేనల్లుడు అయ్యేవాడితో పడకగది సన్నివేశాలు పంచుకోవడం ఆమె ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అని సినీ విశ్లేషకులు, నెటిజన్లు మండిపడుతున్నారు. టాలీవుడ్ మీద ఏడ్చేముందు, బాలీవుడ్లో డబ్బు కోసం ఎలాంటి చెత్త కంటెంట్ చేస్తున్నావో చూసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా రాధికా ఆప్టేను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. “క్రియేటివ్ లిబర్టీ” పేరుతో బాలీవుడ్ చేసే ఏ పనైనా గొప్పగా, సౌత్ ఇండస్ట్రీ చేసే పనులు మాత్రం చీప్‌గా కనిపించే ఇలాంటి నటీమణుల హిపోక్రసీకి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ అని సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!