White House Lockdown: ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉండగానే కలకలం.. తాత్కాలిక లాక్డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
White House Lockdown: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద కలకలం రేగింది.. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌కు ఎదురుగా ఉన్న లఫాయెట్ స్క్వేర్ ప్రాంతంలో ఓ కారు సైన్పోస్ట్ను ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్‌హౌస్ పరిసరాల్లో తాత్కాలిక లాక్డౌన్ విధించారు. ప్రమాదం జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. సిల్వర్ కలర్లో ఉన్న ఓ సెడాన్ కారు లఫాయెట్ స్క్వేర్ ఉత్తర భాగంలోని రాతి పరిచిన ప్రదేశంలోకి దూసుకెళ్లి అక్కడున్న సైన్పోస్ట్ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారులో నుంచి పొగలు వెలువడ్డాయి. ఈ సమయంలో డ్రైవర్ వాహనం నుంచి బయటకు వచ్చాడు. అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బందితో అతడు వాగ్వాదానికి దిగి, అనంతరం భౌతిక ఘర్షణకు పాల్పడ్డాడు.
సీక్రెట్ సర్వీస్, నేషనల్ గార్డ్ సిబ్బందితో డ్రైవర్ ఘర్షణ
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ది వాషింగ్టన్ సన్’కు చెందిన జర్నలిస్ట్ మార్టిన్ ఆస్టర్ముహెల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో ప్రమాదానికి గురైన కారు నుంచి పొగలు వస్తుండగా డ్రైవర్ బయటకు వచ్చి భద్రతా సిబ్బందితో ఘర్షణ పడుతున్న దృశ్యాలు కనిపించాయి. డ్రైవర్ సీక్రెట్ సర్వీస్ అధికారులు, నేషనల్ గార్డ్ సిబ్బందితో పోరాటానికి దిగినట్లు ఆయన వెల్లడించారు. అయితే కారు సైన్పోస్ట్ను ఢీకొట్టడానికి ముందు అసలు ఏం జరిగిందనే విషయం స్పష్టంగా తెలియలేదని పేర్కొన్నారు.
Also Read
- Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!
- Who Is Alice Huang: ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా బాస్‌నే బుట్టలో వేసుకున్న చైనా మిస్టరీ ఉమెన్!
- Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
- Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్‌పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణ అనంతరం డ్రైవర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వైట్‌హౌస్ వద్ద కొద్దిసేపు తాత్కాలిక లాక్డౌన్ విధించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే సమయంలో వైట్‌హౌస్‌లో ఉండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. వైట్‌హౌస్‌కు ఎదురుగా ఉండే లఫాయెట్ స్క్వేర్ ఒక బహిరంగ పార్కు కావడంతో అక్కడ జరిగిన ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే డ్రైవర్ వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? అనే విషయాలపై అప్పటికి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
2023లోనూ వైట్‌హౌస్ సమీపంలోకి దూసుకెళ్లిన యూ-హాల్ ట్రక్కు
వైట్‌హౌస్ సమీపంలో వాహనం భద్రతా అవరోధాలను ఢీకొట్టడం ఇదే తొలిసారి కాదు. 2023 మే నెలలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అప్పట్లో 19 ఏళ్ల యువకుడు యూ-హాల్ ట్రక్కును నడుపుతూ లఫాయెట్ స్క్వేర్ ఉత్తర భాగంలో ఉన్న వైట్‌హౌస్ భద్రతా అవరోధాలను ఢీకొట్టాడు. ఈ ఘటన అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అధ్యక్షుడిని బెదిరించడం, ఫెడరల్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సహా పలు అభియోగాలు అతడిపై నమోదయ్యాయి. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానించారు. తాజాగా మరోసారి వైట్‌హౌస్ ఎదురుగా కారు ప్రమాదానికి గురికావడం, డ్రైవర్ భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగడం అమెరికా భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
White House Lockdown: ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉండగానే కలకలం.. తాత్కాలిక లాక్డౌన్
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
IPL 2027-CSK: అక్షర్ పటేల్ కోసం ఆ స్టార్‌ను వదులుకోవద్దు.. సీఎస్కే భారీ మూల్యం చెల్లించక తప్పదు!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
ట్రెండింగ్
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!