AP MPP, ZPP Indirect Elections 2026: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. MPP, ZPP ఎన్నికల తేదీలు ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPP, ZPP Indirect Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసాయి.. ఇక, పరోక్ష ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండల ప్రజా పరిషత్‌లు (MPPలు), 28 జిల్లా ప్రజా పరిషత్‌ల (ZPPలు) పరిధిలో కో-ఆప్టెడ్ సభ్యులతో పాటు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఎన్నికలకు సంబంధించి కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది.
నవంబర్ 19న MPPలు.. 20న ZPPల ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మండల ప్రజా పరిషత్‌ల (MPP) పరోక్ష ఎన్నికలు నవంబర్ 19, 2026న నిర్వహించనున్నారు. జిల్లా ప్రజా పరిషత్‌ల (ZPP) పరోక్ష ఎన్నికలు నవంబర్ 20, 2026న జరగనున్నాయి. ప్రత్యేక సమావేశాల ద్వారా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మండల, జిల్లా పరిషత్‌లలో ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలకు ముందుగానే కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన వారిని కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎంపిక చేయనున్నారు. ప్రతి మండల ప్రజా పరిషత్‌కు ఒకరు, జిల్లా ప్రజా పరిషత్‌కు ఇద్దరు చొప్పున కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాలి. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.
Also Read
- iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!
- AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 30కి పైగా అంశాలపై ఫోకస్..!
- AP High Court: వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు మరో కేసు టెన్షన్..! హైకోర్టులో క్వాష్ పిటిషన్
- AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
చేతులెత్తే విధానంలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక
MPP, ZPP అధ్యక్ష, ఉపాధ్యక్షులు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు చేతులెత్తే విధానంలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల విప్ వర్తిస్తుంది. అంటే ఆయా పార్టీల సభ్యులు తమ పార్టీ జారీ చేసిన విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక విషయంలో పార్టీ విప్ జారీ చేయడానికి ఎలాంటి నిబంధన లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రత్యేక సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్-అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చు. కానీ, పరోక్ష ఎన్నికల్లో వారికి ఓటు వేసే హక్కు ఉండదు. ఎన్నికైన MPTC, ZPTC సభ్యులే ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నవంబర్ 14లోపు సమావేశాల నోటీసులు
పరోక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికైన MPTC, ZPTC సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులను నవంబర్ 14, 2026లోపు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోటీసుల జారీ, సమావేశాల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
AP MPP, ZPP Indirect Elections 2026: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. MPP, ZPP ఎన్నికల తేదీలు ఖరారు!
-
Ramayana Box Office Collections: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
-
iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!
-
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి..!
-
Supreme Court Judgment: ప్రభుత్వ ఉద్యోగి 48గంటలు కస్టడీలో ఉంటే సస్పెండయినట్టే..
ట్రెండింగ్
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!