అశ్వగంధ, ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకత ఉంది. హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడే, శక్తి స్థాయిని పెంచే పొటాషియం, క్యాల్షియం ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా ఏమేమి వున్నాయంటే..

పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసారాన్ని మెండుగా అందించే విటమిన్‌ ఇ అశ్వగంధలో హెచ్చుగా ఉంది

అశ్వగంధ లేహ్యం మంచి పుష్టినీ బలాన్నీ చేకూర్చేదిగాను, ఉదర సంబంధ వ్యాధులను దివ్యౌషధంగాను చెపుతారు.

మహిళల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్‌ కు చికిత్స చేయడంలో అశ్వగంధ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మానసిక ఒత్తిడిని నివారించడంలోనూ, నీరసాన్ని దగ్గరకి రానివ్వకుండా చేస్తుంది.

అశ్వగంధ చూర్ణంతో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి కనుక ఇది ఎఫెక్టివ్‌ పెయిన్‌ కిల్లర్‌ లా పనిచేస్తుంది.

అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు ఉపశమనం కలుగుతుంది.

అశ్వగంధ చూర్ణం ద్వారా స్ర్తీ-పురుషుల సమస్యల నుంచి ఉపశమనం పొందినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

గమనిక చిట్కాలను పాటించే మందు వైద్య నిపుణుడి సలహా తీసుకోండి