Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Govt Jobs Rules: అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. బహుభార్యత్వానికి పాల్పడినట్లు తేలితే సంబంధిత ఉద్యోగిని విధుల నుంచి తొలగించడంతో పాటు, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అనర్హుడిగా ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.
బహుభార్యత్వానికి పాల్పడితే ఉద్యోగం రద్దు
అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా బహుభార్యత్వానికి పాల్పడినట్లు నిర్ధారణ అయితే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ నిర్ణయం ఏ ఒక్క మతానికో పరిమితం కాదని, అన్ని మతాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు బహుభార్యత్వానికి పాల్పడితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయంలో భాగంగా అస్సాం సర్వీస్ అండ్ డిసిప్లిన్ నిబంధనల్లో సవరణలు చేసినట్లు సీఎం తెలిపారు. నిబంధన 7లోని సెక్షన్ 6ను చేర్చినట్లు వివరించారు.
Also Read
బహుభార్యత్వానికి పాల్పడినట్లు నిర్ధారణ అయిన ఉద్యోగికి ఉద్యోగం కోల్పోవడమే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు సహా అన్ని మతాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధన సమానంగా వర్తిస్తుందని సీఎం హిమంత వెల్లడించారు.
మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో అస్సాంలోని శివసాగర్, చరాయ్‌దేవ్ జిల్లాల్లో సంభవించిన తీవ్ర వరదలకు అసలు కారణాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది. నవంబర్ 4, మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపనున్నట్లు సీఎం హిమంత తెలిపారు. అయితే, ఈ కేసును సీబీఐకి అప్పగించాలా వద్దా అనే తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు.
వరదల వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి రావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం హిమంత పేర్కొన్నారు. ఈ ఏడాది అస్సాంలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెనలు సైతం దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వరదలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లో బహుభార్యత్వంపై కఠిన నిబంధనలు తీసుకురావడం, మరోవైపు తీవ్ర వరదలపై సీబీఐ విచారణకు సిద్ధమవడం అస్సాం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
-
Vijayawada Mayor: వంగవీటి రాధాకృష్ణ రికార్డు విజయం.. పుట్టిన రోజు నాడే మేయర్‌గా!
-
TVS Apache RTR 125 LC: EICMA 2026లో TVS Apache RTR 125 LC బైక్ ఆవిష్కరణ.. 125cc ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
-
Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!