Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కో పార్ట్‌పై సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చిత్ర బృందం చెబుతున్నప్పటికీ, సినిమా ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ తీసుకురాలేకపోయింది. గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఏవీ ప్రేక్షకుల్లో పూర్తిస్థాయి ఉత్సాహాన్ని నింపలేకపోయాయి.
రాముడి పాత్రలో రణ్‌బీర్ లుక్స్‌పై పెదవి విరుపులు, సీత పాత్రకు సాయి పల్లవి సరిపోలేదంటూ వచ్చిన కామెంట్లు, ఏఆర్ రెహమాన్ ట్యూన్స్‌పై వచ్చిన కాపీ ఆరోపణలు సినిమాపై ముందునుంచే నెగెటివ్ ప్రభావాన్ని చూపించాయి. వీటికి తోడు, ఇటీవల లాస్ ఏంజెల్స్‌లో వేసిన ప్రత్యేక షోకు సైతం డివైడ్ టాక్ రావడం చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. మార్కెట్లో సరైన క్రేజ్ లేకపోవడం, విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు మేకర్స్ ఒక వినూత్న ఎత్తుగడ వేశారు. ఎలాగైనా సినిమాపై హైప్ పెంచాలనే ఉద్దేశంతో మేకర్స్ ఒక అనూహ్య ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. థియేటర్లలో విడుదలకు ఐదు రోజుల ముందే కొంతమంది ఎంపిక చేసిన బాలీవుడ్ సెలబ్రిటీ రివ్యూవర్లకు ప్రత్యేకంగా సినిమాను చూపించారు. అయితే, ఆ రివ్యూ రైటర్లు ఏకంగా ‘ఐదుకు ఐదు’ (5/5) ఫైవ్ స్టార్ రేటింగ్‌లు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సినీ వర్గాలను విస్తుపోయేలా చేసింది.
Also Read
- Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
- Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!
- Jayasudha: ‘మీరు - నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
- Kiran Abbavaram : వెనక్కి తగ్గిన '#HATAH'.. అందుకేనని ప్రకటన
టీజర్లు, ట్రైలర్లు, పాటల్లో ఏ ఒక్కటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయినప్పుడు.. రివ్యూవర్లకు మాత్రం ఏకంగా ఫైవ్ స్టార్ ఇచ్చేంతగా సినిమా ఎలా నచ్చిందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నెలకొన్న నెగెటివ్ టాక్‌ను కవర్ చేసి, ఆడియన్స్‌లో కృత్రిమంగా హైప్ క్రియేట్ చేయడానికే మేకర్స్ ఇలాంటి రేటింగ్స్ వేయించారా? లేక విజువల్స్ నిజంగానే అంత అద్భుతాన్ని సృష్టించాయా? అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంత బాగున్నా ఒక సినిమాకు ఏకపక్షంగా 5/5 రేటింగ్ ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఏంటో తేలాలంటే సాధారణ ప్రేక్షకులు సినిమా చూసే వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
-
Anshul Kamboj: అతని బౌలింగ్ నిజంగా అద్భుతం.. అరుదైన క్లబ్లో చోటు..!
-
CM Chandrababu Aerial Survey: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ..
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!