Mijia Electric Toothbrush 2 Pro: షియోమీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లాంచ్.. కలర్ స్క్రీన్, ప్రెజర్ అలర్ట్ ప్రత్యేకతలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Mijia Electric Toothbrush 2 Pro Launched: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ Xiaomi కొత్త ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను లాంచ్ చేసింది. Mijia Electric Toothbrush 2 Pro పేరుతో వచ్చిన ఈ కొత్త టూత్‌బ్రష్‌లో కలర్ స్క్రీన్‌తో పాటు అప్‌గ్రేడ్ చేసిన బ్రష్ హెడ్, కొత్త సోనిక్ వైబ్రేషన్ మోటార్ వంటి ఫీచర్లను అందించారు. వినియోగదారులకు మెరుగైన బ్రషింగ్ అనుభవాన్ని అందించేందుకు ఇందులో పలు కొత్త ఫీచర్లను జోడించారు. ముఖ్యంగా, బ్రష్ చేసేటప్పుడు ఎక్కువ లేదా తక్కువ ఒత్తిడి పెడితే హెచ్చరించే టూ-వే ప్రెజర్ అలర్ట్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Xiaomi Mijia Electric Toothbrush 2 Pro ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌లో Sonic Vibration Motor 2.0ను అందించారు. కంపెనీ ప్రకారం, ఈ మోటార్ దంతాలపై ఉండే ప్లాక్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. వివిధ బ్రషింగ్ మోడ్లకు అనుగుణంగా ఇందులో వేర్వేరు వైబ్రేషన్ ప్యాటర్న్లు కూడా ఉన్నాయి. Xiaomi ఈ కొత్త మోడల్లో బ్రష్ హెడ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. దీనితో పాటు ఆల్-అరౌండ్ షాక్ అబ్జార్బింగ్ స్ట్రక్చర్ ను అందించారు. సాఫ్ట్ రబ్బర్ మెటీరియల్ కారణంగా దంతాలు, చిగుళ్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని ఫ్లెక్సిబుల్ డిజైన్ కారణంగా నోటి లోపల దంతాల ఆకృతికి అనుగుణంగా బ్రిసిల్స్ కదిలేందుకు సహాయపడుతుంది.
Also Read
- Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
- REDMAGIC 12 Pro: 8400mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ ఫోన్.. REDMAGIC 12 Pro లాంచ్.. 185Hz OLED డిస్ప్లే, 50MP కెమెరా
- HP New Laptops Launched: HP OmniBook 5, ProBook 4 G2iS భారత్ లో లాంచ్.. రూ.1.10 లక్షల ల్యాప్‌టాప్ రూ.79,999కే!
- Dell 14S: Dell 14S భారత్‌లో లాంచ్.. 2.8K డిస్ప్లే, Intel Core ప్రాసెసర్, Dolby Atmos సపోర్ట్
కలర్ స్క్రీన్‌లో బ్రషింగ్ వివరాలు
ఈ టూత్‌బ్రష్‌లో ఉన్న కలర్ డిస్ప్లే మరో ప్రత్యేక ఫీచర్. బ్రషింగ్ సమయం, ఎంత మేరకు దంతాలను శుభ్రం చేశారనే వివరాలను ఇది రియల్‌టైమ్‌లో చూపిస్తుంది. వినియోగదారు నోటిలోని ఏదైనా భాగాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే లేదా తక్కువ సమయం బ్రష్ చేస్తే స్క్రీన్‌పై అలర్ట్ కనిపిస్తుంది. ఇందులో డిఫాల్ట్ బ్రషింగ్ సెషన్ సమయం 4 నిమిషాలుగా ఉంది. బ్యాటరీ విషయంలో కూడా Xiaomi Mijia Electric Toothbrush 2 Pro ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇందులో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ను అందించారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ డివైస్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. అయితే ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 180 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగలదని Xiaomi పేర్కొంది. అంతేకాకుండా ఇందులో IPX8 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.
Xiaomi Mijia Electric Toothbrush 2 Pro ధర ఎంత?
Xiaomi Mijia Electric Toothbrush 2 Proను ప్రస్తుతం చైనాలో లాంచ్ చేశారు. దీని రిటైల్ ధర 249 యువాన్, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3,100గా ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయంపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.
తాజావార్తలు
-
IND vs NZ 1st ODI: కోహ్లీ, రోహిత్, గిల్‌కు అరుదైన గౌరవం!
-
Mijia Electric Toothbrush 2 Pro: షియోమీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లాంచ్.. కలర్ స్క్రీన్, ప్రెజర్ అలర్ట్ ప్రత్యేకతలు ఇవే!
-
AP Elections 2026: ఎస్ఈసీ కీలక సమీక్ష.. ఆ మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..
ట్రెండింగ్
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం