రివ్యూ : ఆదర్శ కుటుంబం 47
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Venkatesh Daggubati, Srinidhi Shetty, Dimple Hayathi, Nivetha Pethuraj and Others
- DIRECTOR: Trivikram Srinivas
- MUSIC: SS Thaman
- PRODUCER: S. Radha Krishna
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం 47. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చిన్నబాబు ఈ సినిమాను నిర్మించడం, తమన్ మ్యూజిక్ అందించడంతో పాటు శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ వంటి వాళ్లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. దానికి తోడు, ప్రమోషన్స్ కూడా సినిమా టీమ్ గట్టిగానే చేసింది. కాకపోతే, వరుస వాయిదాలు పడుతూ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతూ వచ్చింది. కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న క్రమంలో, ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
ఆదర్శ కుటుంబం AK 47 కథ:
ఒక హాస్పిటల్లో ఉద్యోగం చేసే చిట్టిబాబు (వెంకటేష్), తన భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), కొడుకు సర్వ (ప్రజ్వల్), కుమార్తె (యువినా పార్థవి) తో ఒక సాదాసీదా జీవితం గడుపుతూ ఉంటాడు. భార్య చీటీ పాట కారణంగా నాలుగు లక్షలు నష్టపోవడంతో పాటు, కొడుకు ఆపరేషన్ కోసం రెండు లక్షలు కావాలని తెలియడంతో, ఆ డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే, అనుకోకుండా కొన్న ఒక లాటరీ టికెట్ ద్వారా ఈ ఫ్యామిలీకి వంద కోట్లు వచ్చి పడతాయి. దీంతో అప్పటి వరకు ఒక చిన్న కాలనీలో ఉండే వాళ్లు పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతారు.
Also Read
అయితే, బీహార్ డకాయిటీ గ్యాంగ్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ, తెలంగాణలోకి ఎంటర్ అయ్యాక, ఈ ఫ్యామిలీ నుంచి వీళ్లు సంపాదించిన వంద కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేస్తారు. అందులో భాగంగానే, ఆ గ్యాంగ్‌కు చెందిన నీలా(దేవియాని శర్మ), ఆమె తమ్ముడు పింటూ అదే ఇంటిలో పనికి చేరతారు. ఇక ఒక రాత్రి చూసుకుని, వారి ఇంటి నుంచి డబ్బు దొంగిలించడానికి ప్లాన్ చేస్తారు.
ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? వీరి ఇంటి నుంచి బీహార్ గ్యాంగ్ డబ్బు దొంగతనం చేసిందా లేదా? చివరికి ఏం జరిగింది? ఈ సినిమాలో చిత్తరంజన్(సత్య), డీఎస్పీ బృహస్పతి( రావు రమేష్), ఎస్పీ (నారా రోహిత్) పాత్రలు ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
త్రివిక్రమ్ దర్—త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సినిమా అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటినుంచే, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, త్రివిక్రమ్ మార్క్ ఉంటుందా లేక గురూజీ ఏమైనా కొత్తగా ప్రయత్నం చేశారా అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. అంతేకాక, ఇటీవల రిలీజ్ అయిన బ్లాస్ట్ అనే సినిమాలానే ఈ సినిమా కూడా ఉందని, కొన్ని రీషూట్లు చేశారని కూడా ప్రచారం జరిగింది. అలా ఒక రకంగా ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ కన్నా ఎక్కువగా ఇలాంటి బజ్జె ఎక్కువగా ఉంది.
మరి ఇలాంటి సినిమా చూడడానికి థియేటర్లకు వెళ్తున్న క్రమంలో, అసలు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండానే వెళ్లడం మంచిది. అయితే అలా వెళ్లిన తర్వాత, సినిమా ప్రారంభం అయ్యాక చాలా ఒక సాదాసీదా మిడిల్ క్లాస్ వ్యక్తిగా వెంకటేష్ పాత్ర పరిచయం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ కష్టాలు… సరదా సరదాగా సాగిపోతున్న గిల్లికజ్జాలతో చూపిస్తూనే, ఒక్కసారిగా ఒక వంద కోట్ల లాటరీ తగిలిన క్రమాన్ని కొంచెం లాజిక్ లెస్ గానే చూపించారు.
అయితే ఆ తర్వాత రాసుకున్న సన్నివేశాలు సినిమా మీద అంచనాలు పెంచుతూ వెళ్లాయి. ఒక ఫ్యామిలీకి వంద కోట్ల లాటరీ తగలటం, అప్పటికే ఒక డెకాయిటీ వీరి మీద కన్నేయడం లాంటి విషయాలు కొంచెం లాజిక్ లెస్‌గానే అనిపించినా కూడా, ఎంగేజింగ్ రాసుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు, అంతకుముందు లాజిక్ లెస్ అనిపించిన అన్ని విషయాలకి సరైన లాజిక్ ఉండేలాగా కరెక్ట్ గా సెట్ చేశారు.
ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక, సినిమా ఫస్ట్ హాఫ్ హాఫ్ ఇచ్చినంత కిక్ ఇవ్వట్లేదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సినిమా సాగుతున్న కొద్దీ ఆ విషయాన్ని దాటి సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఒక డెకాయిట్ గ్యాంగ్ గ్యాంగ్ ఒక ఫ్యామిలీ వెనుక పడటం, వారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఆ కుటుంబం ఏం చేసింది అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు. మరోపక్క, పోలీసులతో ఉన్న కొన్ని సీన్లు కూడా ఆసక్తికరంగానే అనిపించాయి.
మొత్తంగా చెప్పాలంటే, ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ సాగింది. మధ్యలో కొన్ని లాజిక్ లెస్ అనిపించినా, తర్వాత వచ్చే సన్నివేశాలతో ఆ లాజిక్స్ అన్నింటినీ కవర్ చేశారు. అక్కడక్కడా బోర్ ఫీల్ అయ్యేలా చేసినా, ఈ సినిమా ఎంగేజింగ్ అనిపించిందని చెప్పొచ్చు. అలాగే, దర్శకుడు రాసుకున్న ట్విస్టులు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. కొన్ని చోట్ల అవి ప్రిడిక్టబుల్‌గా అనిపించినా, మరికొన్ని చోట్ల మాత్రం ఆకట్టుకున్నాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో చిట్టిబాబు అనే పాత్రలో విక్టరీ వెంకటేష్ ఒదిగిపోయాడు. ఆయనకు ఈ తరహా పాత్రలు చేయడం కొట్టిన పిండే. ఒక రకంగా, ఆయన పాత్ర దృశ్యంలోని పాత్రను గుర్తు చేయడం గమనార్హం.
అయితే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ చేత ఎక్స్ప్రెషన్స్ పలికించడానికి, “నేనేనా కమల్ హాసన్ లేదా మోహన్ లాల్ అనుకున్నావా?” అంటూ డైలాగ్ చెప్పించడం కత్తిమీద సాము లాంటి విషయం. అలాంటి ఆయనతోనే అలాంటి డైలాగ్ చెప్పించి, ప్రేక్షకుల్లో వెంకీ మామ మీద ఉన్న ప్రేమను రెట్టింపు అయ్యేలా చేశారు.
ఇక స్వర్ణ అనే పాత్రలో కూడా శ్రీనిధి శెట్టి ఒదిగిపోయింది. ఆమె నటించిన తీరు ఆకట్టుకుంది. నివేదా పేతురాజ్ పాత్ర పెద్దగా ఏమీ లేదు. కనిపించిన రెండు మూడు సీన్లలో అందాన్ని ఆరబోసే ప్రయత్నం చేసి ఆకట్టుకుంది.
ఇక చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన రాజా, ప్రజ్వల్‌తో పాటు యువీనా పార్ధవి కూడా ఆకట్టుకుంది. అలాగే, దురందర్ ఫేమ్ నటుడు విలన్ పాత్రలో జీవించాడు. దేవియాని శర్మ సహా మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. నారా రోహిత్‌కు ఎస్పీ పాత్ర పెద్దగా నటించే స్కోప్ ఇవ్వకపోయినా, ఉన్నంతలో ఆయన ఆకట్టుకున్నాడు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాలో తమన్ డ్యూటీ చేశాడు. వాస్తవానికి మాట్లాడుకోవాలంటే, పాటలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. కానీ, ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో డ్యూటీ చేశాడు. ఒక రకంగా, సినిమాకి మేజర్ హైలైట్స్ లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఒకటి అని చెప్పక తప్పదు. ఇక గురూజీ విషయానికి వస్తే, తన మార్క్ మిస్ అవకుండానే కొంచెం కొత్త జానర్‌ను ట్రై చేసే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.
ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా కరెక్టుగా కట్ చేశారు. కాకపోతే, సెకండ్ హాఫ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా ఆదర్శ కుటుంబం AK47 ఎంగేజింగ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్
తాజావార్తలు
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!