Reasons Behind Republican Defeat: ఇరాన్ వార్ నుంచి అభ్యర్థుల ఫెయిల్యూర్ దాకా.. ట్రంప్ పార్టీ ఓటమికి అసలు కారణాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reasons Behind Republican Defeat: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అగ్రరాజ్య పార్లమెంటులోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్ రెండింటిలోనూ డెమోక్రాట్లు స్పష్టమైన మెజారిటీ సాధించి పట్టు సాధించారు. రెండవ విడత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రెండేళ్లలోనే రెండు సభలపై నియంత్రణ కోల్పోవడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయంగా పెద్ద షాక్. అయితే, ఈ పరాభవంపై స్వయంగా ట్రంప్ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ తమ పార్టీ ఓటమికి దారితీసిన ఐదు ప్రధాన కారణాలను విశ్లేషించారు.
1. ఇరాన్ యుద్ధం.. పెట్రోల్ ధరల మంట
రిపబ్లికన్ల ఓటమికి ప్రధాన కారణాల్లో మొదటిది ఇరాన్ యుద్ధ ప్రభావమని ట్రంప్ స్వయంగా అంగీకరించారు. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇది అమెరికాలోని సాధారణ కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలు తన విధానాలను సమర్థించినప్పటికీ, పెట్రోల్-గ్యాసోలిన్ ధరల తక్షణ భారాన్ని మోసేందుకు సిద్ధంగా లేరని, అదే ఎన్నికల్లో ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా మార్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే, యుద్ధ నిర్ణయం తీసుకున్నందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read
- US Midterm Elections 2026: మిచిగాన్ నుంచి తొలి ముస్లిం సెనేటర్‌గా చరిత్ర సృష్టించిన డెమోక్రాట్.. అబ్దుల్ ఎల్-సయీద్ ఎవరు?
- US Midterm Elections Results: అధ్యక్షుడిపై తీవ్ర ఆగ్రహం.. 70 శాతం మంది యూత్‌కి ట్రంప్ నచ్చలే..
- Trump’s Midterm Setback: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో.. ట్రంప్ పార్టీ ఓడితే భారత్‌కు లాభమా? నష్టమా?
- Spain Train Disaster: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 69 మంది మృతి.. రవాణా మంత్రి రాజీనామా!
2. బరిలో స్వయంగా ట్రంప్ లేకపోవడం
ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై తన పేరు లేకపోవడం ఫలితాలను భారీగా మార్చేసిందని ట్రంప్ వాదించారు. “ఒకవేళ నేనే స్వయంగా ఎన్నికల బరిలో ఉండి ఉంటే పార్టీకి ఏకపక్షంగా భారీ విజయం దక్కేది” అని వ్యాఖ్యానించారు. తన కోసం ఓటు వేయడానికి ఓటర్లు చూపించే ఉత్సాహం స్థానిక అభ్యర్థుల విషయంలో కనిపించలేదని, అది ఓట్ల శాతాన్ని దెబ్బతీసిందని చెప్పుకొచ్చారు.
3. అభ్యర్థుల సొంత బలహీనతలు
పార్టీ తరఫున నిలబడిన పలువురు అభ్యర్థుల వ్యక్తిగత లోపాలే ఓటమికి మరో కారణమని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటర్ల అభిమానాన్ని సంపాదించలేకపోయారని, సొంత పార్టీ మద్దతుదారులే కొందరిని తిరస్కరించారని అన్నారు. ఈ ఓటమిని తన ప్రభుత్వ పాలనకు వ్యతిరేక తీర్పుగా భావించలేమని, రెండేళ్లలో తమ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు కనబరిచిందని, అభ్యర్థుల అసమర్థతను ప్రభుత్వ విధానాలకు ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు.
4. ఫాక్స్ న్యూస్ పక్షపాత వైఖరి
సంప్రదాయకంగా రిపబ్లికన్లకు అనుకూలంగా భావించే ప్రముఖ మీడియా ఛానల్ ‘ఫాక్స్ న్యూస్’ తీరుపై కూడా ట్రంప్ నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ నేతలకు, విపక్షాలకు ఫాక్స్ న్యూస్ మితిమీరిన కవరేజీ ఇచ్చి తమ అవకాశాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. న్యూయార్క్ మాజీ మేయర్ బిల్ డి బ్లాసియో లాంటి విపక్ష నేతలకు ఎక్కువగా చోటు కల్పించడమే తమ ఓటమికి ఒక పరోక్ష కారణమని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆరోపించారు.
5. డెమోక్రాట్ల దూకుడు, బలమైన ప్రచారం
చివరిగా, విపక్ష డెమోక్రాట్ల క్షేత్రస్థాయి పనితీరును ట్రంప్ స్వయంగా ప్రశంసించారు. వారు అత్యంత సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్లారని ఆయన అంగీకరించారు. ఆ సమయంలో ఎన్నికల వాతావరణం వారికి అనుకూలంగా మారిందని పేర్కొన్నారు. రెండు సభల్లోనూ పట్టు కోల్పోయినప్పటికీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పిన ట్రంప్.. ఒకవేళ వాళ్లు హద్దులు దాటి ఏదైనా అర్థంపర్థం లేని బిల్లులు తీసుకొస్తే మాత్రం తన వీటో అధికారంతో వాటిని అక్కడికక్కడే ఆపేస్తానని హెచ్చరించారు. దీంతో రాబోయే రోజుల్లో వైట్‌హౌస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ సమరం మరింత వేడెక్కేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Reasons Behind Republican Defeat: ఇరాన్ వార్ నుంచి అభ్యర్థుల ఫెయిల్యూర్ దాకా.. ట్రంప్ పార్టీ ఓటమికి అసలు కారణాలివే!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Food Safety Raids : మిఠాయిల్లో బొద్దింకలు, ఈగలు.. నిజామాబాద్‌లో 13 సంస్థల లైసెన్సులు రద్దు
-
Mahabubabad Mortuary Incident: బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటన.. ఏడాది తర్వాత మళ్లీ విచారణ
-
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
ట్రెండింగ్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!