Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
- బ్యారేజ్ నిర్మాణంపై ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రతో నిరంతర సంప్రదింపులకు ఆదేశం
- ముంపు భూములకు పూర్తి పరిహారం
- నిధుల కోసం ప్రత్యేక జాయింట్ అకౌంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిగిన చర్చల పురోగతిని సమీక్షించిన సీఎం, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ముంపు భూములకు తగిన పరిహారం.. జాయింట్ అకౌంట్లో నిధులు
బ్యారేజ్ నిర్మాణం వల్ల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే భూములకు పూర్తిస్థాయిలో తగిన పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దీనికోసం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అవసరమైన నిధులను ప్రత్యేకంగా ‘జాయింట్ అకౌంట్’లో ఉంచుతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ముంపు ప్రాంతాలు , భూముల వివరాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్వతంత్ర సర్వే చేయించుకున్నప్పటికీ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తేల్చిచెప్పారు. మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమస్త సమాచారాన్ని, ఇప్పటివరకు కుదిరిన ఒప్పందాలు , ఇతర పత్రాలను ఎప్పటికప్పుడు వారికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు సంబంధించిన పూర్తి సమగ్ర వివరాలతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
Also Read
- Water Tankers Strike: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
- Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
- Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
- Graduate MLC: మీరు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
-
CM Chandrababu: తుఫాన్‌ను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pakistan: ముస్లింలకు ముప్పుగా “హిందూ-యూదు కూటమి”.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!