Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atal Pension Yojana: పదవీ విరమణ లేదా వృధ్యాప్యం సమయంలో ఆర్థిక భద్రత ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పనిచేసే కార్మికులు, చిన్న వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులకు వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం అవసరం. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే అటల్ పెన్షన్ యోజన (APY). ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 8.66 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. ఇందులో చేరినవారు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు.
అటల్ పెన్షన్ యోజన అంటే?
వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 మే 9న అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకాన్ని ప్రకటించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) పర్యవేక్షణలో, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) విధానంలో ఇది అమలవుతోంది. ఈ పథకంలో చేరినవారు తమ వయసు, ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి నిర్ణీత కాలం పాటు చందాలు చెల్లించాలి. 60 ఏళ్లు పూర్తయిన తర్వాత జీవితాంతం నెలవారీ పెన్షన్ పొందవచ్చు.
Also Read
- Floor Cleaning Tips: ఫ్లోర్‌పై నల్లటి షూ మచ్చలు పోవడం లేదా? ఈ 4 చిట్కాలు ట్రై చేయండి!
- AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. కర్నూలులో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు!
- Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
- Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
ఎలా దరఖాస్తు చేయాలి?
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న భారతీయ పౌరులు ఈ పథకంలో చేరవచ్చు. దరఖాస్తుదారులకు పొదుపు బ్యాంకు ఖాతా, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు వివరాలు, చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ ఉండాలి. అయితే 2022 అక్టోబర్ 1 నుంచి ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు ఈ పథకంలో కొత్తగా చేరేందుకు అర్హులు కారు. ఆన్లైన్లో దరఖాస్తు ఈ విధంగా చేసుకోవాలి.
– మీ బ్యాంకు నెట్ బ్యాంకింగ్ ద్వారా APYలో నమోదు చేసుకునే సదుపాయం ఉందో లేదో తెలుసుకోవాలి.
– బ్యాంకు వెబ్సైట్లో అటల్ పెన్షన్ యోజనను ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి.
– ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను అందించాలి.
– ఆటో డెబిట్ సదుపాయాన్ని ఎంచుకుంటే నిర్ణీత చందా మీ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.
ఆఫ్లైన్లోనూ..
మీ బ్యాంకు లేదా పోస్టాఫీసును సందర్శించి APY దరఖాస్తు ఫారం తీసుకోవాలి. అవసరమైన వివరాలు నింపి, ఆధార్ కాపీతో పాటు KYC పత్రాలను సమర్పించాలి. దరఖాస్తు స్వీకరించిన తర్వాత బ్యాంకు నుంచి రసీదు లభిస్తుంది. దరఖాస్తు ఆమోదం పొందినప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ధ్రువీకరణ సందేశం వస్తుంది. ఈ పథకంలో చేరినప్పుడు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి నెలవారీ చందా నిర్ణయిస్తారు. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు కనీసం రూ.42 నుంచి గరిష్ఠంగా రూ.210 వరకు చెల్లించాలి. అదే 40 ఏళ్ల వయసులో చేరితే నెలవారీ చందా రూ.291 నుంచి రూ.1,454 వరకు ఉంటుంది. ఈ చందాలను నెలవారీ, మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి చెల్లించవచ్చు. పథకంలో చేరినప్పటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవడం తప్పనిసరి.
రూ.1.70 లక్షల కార్పస్?
ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో చేరి నెలకు రూ.42 చొప్పున చెల్లిస్తే.. 60 ఏళ్లు వచ్చే వరకు మొత్తం 42 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. అంటే 504 నెలలకు కలిపి రూ.21,168 చెల్లించినట్లవుతుంది. ఈ ఎంపికకు సంబంధించిన కార్పస్ మొత్తం సుమారు రూ.1.70 లక్షల వరకు ఉండవచ్చని పథకం వివరాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా నెలకు రూ.5,000 పెన్షన్ పొందాలనుకునే 18 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.210 చొప్పున చెల్లించాలి. 42 ఏళ్లలో మొత్తం రూ.1,05,840 పెట్టుబడి అవుతుంది. ఈ ఎంపికకు సంబంధించిన కార్పస్ మొత్తం సుమారు రూ.8.5 లక్షల వరకు ఉంటాయి.
చందాలు చెల్లించకపోతే?
వరుసగా ఆరు నెలలు చెల్లింపులు చేయకపోతే ఖాతా ఫ్రీజ్ అవుతుంది. 12 నెలలు చెల్లించకపోతే ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల పాటు చందాలు చెల్లించకపోతే ఖాతా మూసివేసే అవకాశం ఉంటుంది. నిర్ణీత సమయంలో చందా చెల్లించకపోతే బ్యాంకులు చిన్న మొత్తంలో జరిమానా విధిస్తాయి.
– నెలవారీ చందా రూ.100 వరకు ఉంటే రూ.1 జరిమానా.
– రూ.101 నుంచి రూ.500 వరకు ఉంటే రూ.2 జరిమానా.
– రూ.501 నుంచి రూ.1,000 వరకు ఉంటే రూ.5 జరిమానా.
– రూ.1,001 కంటే ఎక్కువ ఉంటే రూ.10 జరిమానా.
60 ఏళ్ల తర్వాత పెన్షన్
60 ఏళ్లు పూర్తయిన తర్వాత ఎంచుకున్న మొత్తాన్ని బట్టి నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000 లేదా రూ.5,000 కనీస పెన్షన్ లభిస్తుంది. చందాలపై వచ్చిన పెట్టుబడి రాబడుల ఆధారంగా కనీస హామీ కంటే ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చందాదారుడు మరణిస్తే అతని జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతుంది. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన తర్వాత 60 ఏళ్ల వయసు వద్ద లభించాల్సిన కార్పస్ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. సాధారణంగా 60 ఏళ్లకు ముందే పథకం నుంచి బయటకు రావడానికి అనుమతి ఉండదు. అయితే చందాదారుడి మరణం లేదా నిర్దిష్ట తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అప్పుడు అప్పటివరకు సమకూరిన పెన్షన్ నిధిని నామినీకి చెల్లిస్తారు. స్వచ్ఛందంగా 60 ఏళ్లకు ముందే ఖాతా మూసివేస్తే, చందాదారుడు చెల్లించిన మొత్తంతో పాటు దానిపై వచ్చిన నికర వడ్డీని మాత్రమే తిరిగి పొందుతారు. ప్రభుత్వ సహకార నిధి, దానిపై వచ్చిన వడ్డీ చందాదారుడికి తిరిగి చెల్లించరు.
పన్ను ప్రయోజనాలు కూడా
అటల్ పెన్షన్ యోజనలో చేసిన అర్హత కలిగిన చందాలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD కింద పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. సెక్షన్ 80CCD(1) కింద వర్తించే పరిమితిలో రూ.1.5 లక్షల వరకు, సెక్షన్ 80CCD(1B) కింద అదనంగా రూ.50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. అయితే ఈ ప్రయోజనాలు వర్తించే పన్ను విధానం, ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. మొత్తంగా.. చిన్న మొత్తాలతో దీర్ఘకాలం పాటు పొదుపు చేసి వృద్ధాప్యంలో స్థిరమైన పెన్షన్ పొందాలనుకునే వారికి అటల్ పెన్షన్ యోజన ఉపయోగకరమైన ప్రభుత్వ పథకం. ఇందులో చేరే ముందు మీ వయసు, నెలవారీ చందా, పెన్షన్ ఎంపిక, ఉపసంహరణ నిబంధనలను పరిశీలించడం ముఖ్యం.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. కర్నూలులో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Floor Cleaning Tips: ఫ్లోర్‌పై నల్లటి షూ మచ్చలు పోవడం లేదా? ఈ 4 చిట్కాలు ట్రై చేయండి!
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
ట్రెండింగ్
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!