Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jayasudha: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌కు సహజనటి జయసుధ వేదికపైనే ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఒక సినిమా వేడుకలో మైక్ అందుకున్న ఆమె.. అరవింద్‌తో తనకున్న ఏళ్లనాటి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రేక్షకులందరికీ అల్లు అరవింద్ అంటే బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించే బడా ప్రొడ్యూసర్‌గానే తెలుసు. కానీ ఆయనలో ఓ చక్కని నటుడు కూడా ఉన్నాడన్న సంగతి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదని జయసుధ గుర్తుచేశారు. గతంలో ఆయన కొన్ని చిత్రాల్లో అద్భుతంగా నటించారని ఆమె ప్రశంసించారు.
ఈ సందర్భంగానే జయసుధ అసలు విషయాన్ని బయటపెట్టారు. “అల్లు అరవింద్ గారూ.. మీరు ఓ సినిమా ప్రొడ్యూస్ చేయండి.. అందులో మీరూ, నేనూ కలిసి నటిద్దాం అని నేను ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు మళ్లీ అదే మాట అడుగుతున్నా.. మీ బ్యానర్లో మనమిద్దరం కలిసి యాక్ట్ చేద్దాం. ఆ సినిమాకు ‘రోమన్ హాలిడే’ అని టైటిల్ కూడా పెట్టేసుకుందాం” అంటూ ఆమె సరదాగా ప్రపోజ్ చేయడంతో ఆడిటోరియం మొత్తం నవ్వులతో నిండిపోయింది. జయసుధ వేసిన ఈ పంచ్‌కు ముందు వరుసలో కూర్చున్న అల్లు అరవింద్ సైతం ఎంతో మురిసిపోయారు. చేతులు జోడించి నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆమె మాటలను స్వాగతించారు. సీనియర్ల మధ్య సాగిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Also Read
తాజావార్తలు
-
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
-
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!