Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?
- రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై పేలుడు.
- అనూప్‌గఢ్–సూరత్‌గఢ్ రైల్వే మార్గంలోని ఘటన.
- ఉగ్రకుట్రగా అనుమానిస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Track Blast: రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భగ్నమైనట్లు తెలుస్తోంది. శ్రీగంగానగర్ జిల్లాలో రైలును పేల్చేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనూప్‌గఢ్–సూరత్‌గఢ్ రైల్వే మార్గంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రైల్వే పట్టాల కింద ఉన్న రెండు నుంచి మూడు సిమెంట్ స్లీపర్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. అనూప్‌గఢ్ నుంచి బటిండాకు వెళ్తున్న రైలు ఆ ప్రాంతాన్ని దాటిన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
అనూప్‌గఢ్–సూరత్‌గఢ్ రైల్వే లైన్‌లోని 50 జీబీ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు సిమెంట్ దిమ్మెల నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. రైల్వే పట్టాలకు బిగించే క్లిప్పులు సైతం విడిపోయాయి. అనూప్‌గఢ్ నుంచి బటిండా వెళ్లే రైలును లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలకు పాల్పడిఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, పేలుడు వెనక కారణాలు, ఇతర వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
సమాచారం తెలియడంతో జిల్లా ఎస్పీ హరిశంకర్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్), ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందాలు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. బాంబ్ స్వ్కాడ్ కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ హరిశంకర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!