Reliance: మార్కెట్లో అంబానీ సునామీ.. ఒక్క రోజే రూ. 1.29 లక్షల కోట్లు జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance: దలాల్ స్ట్రీట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సృష్టించిన ప్రకంపనలు అంతర్జాతీయ మార్కెట్లను సైతం ఆశ్చర్యపరిచాయి. గత కొద్ది నెలలుగా దాదాపు 28 శాతం మేర పతనమై, ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించిన రిలయన్స్ స్టాక్.. ఒక్క దెబ్బతో తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల వెల్లడి తర్వాత సోమవారం ట్రేడింగ్ మొదలైన క్షణం నుంచే రిలయన్స్ షేర్లలో కొనుగోళ్ల సునామీ కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం 45 నిమిషాల్లోనే షేరు ధర ఏకంగా 8 శాతానికి పైగా ఎగబాకి రూ. 1,259 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఈ ఒక్క రోజు భారీ ర్యాలీతో రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 1.29 లక్షల కోట్లకు పైగా పెరిగి, కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 17.04 లక్షల కోట్ల రికార్డు మైలురాయిని దాటేసింది.
ఇటీవల జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్ తర్వాత కూడా కదలని షేరును కంపెనీ ఆర్థిక ఫలితాలు సరికొత్త ఎత్తుకు చేర్చాయి. దలాల్ స్ట్రీట్ నివేదిక ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం 41 శాతం పెరిగి రూ. 25,548 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 18,165 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ. 3.32 లక్షల కోట్లకు పెరిగింది. రిటైల్ విభాగంలో క్విక్ కామర్స్ పోటీ వల్ల స్వల్ప ఒత్తిడి ఉన్నప్పటికీ, ‘ఆయిల్ టు కెమికల్స్’ విభాగం అంచనాలకు మించి రాణించింది. ఈ విభాగం ఎబిట్డా ఏకంగా 68 శాతం ఎగబాకి రికార్డు స్థాయిలో రూ. 25,203 కోట్లను తాకింది. అంతర్జాతీయంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, గ్యాస్ ఆయిల్ మార్జిన్లు 3.5 రెట్లకు పైగా పెరగడం సంస్థకు భారీగా కలిసొచ్చింది.
Also Read
- New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
- India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
- EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
- Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
అంబానీ కంపెనీ చూపించిన ఈ దూకుడుతో ప్రముఖ మార్కెట్ అనలిస్టులు తమ అంచనాలను పెంచేశారు. జెఫరీస్ రిలయన్స్‌కు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 1,710 టార్గెట్ ధరను నిర్ణయించింది. ప్రస్తుత ధరతో పోలిస్తే రాబోయే రోజుల్లో ఈ షేరు మరో 47 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. శీతాకాలంలో చమురు శుద్ధి మార్జిన్లు మరింత బలంగా ఉంటాయని అంచనా వేసింది. ఇక నోమురా.. రిలయన్స్ ఎబిట్డా తమ అంచనాల కంటే 9 శాతం ఎక్కువగా ఉందని చెబుతూ, రూ. 1,560 టార్గెట్‌తో 34 శాతం అప్‌సైడ్ ఉంటుందని తెలిపింది. నువామా కంపెనీ నికర అప్పు రూ. 1.17 లక్షల కోట్లతో పూర్తి నియంత్రణలో ఉందని స్పష్టం చేస్తూ రూ. 1,703 టార్గెట్ ఇచ్చింది. భవిష్యత్తులో ప్రారంభం కానున్న ‘న్యూ ఎనర్జీ’ విభాగం లాభాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషించింది. 52 వారాల గరిష్ట స్థాయి రూ. 1,611 కంటే ప్రస్తుత షేరు ధర ఇంకా దిగువనే ఉన్నప్పటికీ, సోమవారం నమోదైన ఈ దూకుడు గత నష్టాలన్నింటినీ పూడ్చివేసి కొత్త రికార్డుల దిశగా పయనించేందుకు బలమైన పునాదిని వేసిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Reliance: మార్కెట్లో అంబానీ సునామీ.. ఒక్క రోజే రూ. 1.29 లక్షల కోట్లు జంప్!
-
US Plane Crash: భయంతో అరిచిన పైలట్.. క్షణాల్లో కుప్పకూలిన విమానం.. వెలుగులోకి చివరి క్షణాలు.!
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!