Food Safety Raids : మిఠాయిల్లో బొద్దింకలు, ఈగలు.. నిజామాబాద్‌లో 13 సంస్థల లైసెన్సులు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ, నాసిరకం ఆహార తయారీదారులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG-SAFE) విరుచుకుపడింది. నవంబర్ 3న నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 14 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. మసాలా దినుసులు, ప్యాకేజ్డ్ తాగునీరు, స్వీట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు బేకరీలు సహా మొత్తం 28 ఆహార విక్రయ కేంద్రాలలో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సమయంలో అత్యంత దారుణమైన పరిస్థితులు వెలుగుచూశాయి. అపరిశుభ్రమైన వంటశాలలు, విరిగిపోయిన ఫ్లోరింగ్, మురుగు నీరు నిలవడం, గ్రీజు, నల్లటి మసితో కూడిన గోడలు మరియు చిమ్నీలు కనిపించాయి. అంతేకాకుండా తినుబండారాల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల మల విసర్జన ఆనవాళ్లు బయటపడ్డాయి. కాలం చెల్లిన ఆహార పదార్థాలు, లేబుల్స్ లేని ఆహార నిల్వలు, ఆహార పదార్థాలపై న్యూస్‌పేపర్లు చుట్టడం, బస్తాల్లో కీటకాలు సంచరించడం వంటి తీవ్రమైన లోపాలను అధికారులు గుర్తించారు. ప్యాకేజ్డ్ వాటర్ యూనిట్లలో ఇన్-హౌస్ ల్యాబ్‌లు లేకుండానే నీటిని సరఫరా చేస్తున్నట్లు తేలింది.
Also Read
ఈ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు:
కల్తీ అనుమానంతో 26 నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన సుమారు ₹17,28,495 విలువైన 9,645 కేజీల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. FSSAI లైసెన్స్ లేకుండా అక్రమంగా నడుస్తున్నందుకు మహారాజా స్వీట్స్ & బేక్స్ (మిర్చి కాంపౌండ్), పంచవటి స్వీట్స్ (దుబ్బ), శివశక్తి ఐస్‌క్రీమ్ (దుబ్బ), సాగర్ బేకరీ (ఆటోనగర్) లను అధికారులు మూసివేయించారు.
ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న 13 వ్యాపార సంస్థల లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేస్తూ, కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.
* ఎల్.పి. ప్రొడక్ట్స్ (మిర్చి కాంపౌండ్)
* జునైరా ఫ్యామిలీ రెస్టారెంట్ (బోధన్ రోడ్)
* ఛప్పన్ భోగ్ స్వీట్స్ (మిర్చి కాంపౌండ్)
* ఖురేషియా హోటల్ (సారంగాపూర్)
* వాటర్ సొల్యూషన్ కంపెనీ (జన్నాపల్లి రోడ్)
* జనతా ట్రేడర్స్ (జన్నాపల్లి క్రాస్ రోడ్స్, ఖానాపూర్)
* ఇరా ఫుడ్స్ & బెవరేజెస్ (ముబారక్ నగర్)
* సుఖ్జీత్ స్టార్చ్ మిల్స్ (ముబారక్ నగర్)
* శ్రీ అయ్యప్ప ట్రేడర్స్ (దుబ్బ)
* రాధే మిఠాయి వాటిక (దేవి థియేటర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ రోడ్)
* శ్రీ రాధే ఎంటర్ప్రైజెస్ (మార్వాడి గల్లీ, నిజామాబాద్ టౌన్)
* మొగ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రాంనగర్)
* క్వాలిటీ స్వీట్స్ & చిక్కీ / కేకే స్వీట్స్ (ముజాహిద్ నగర్)
రెడ్ లయన్ బార్ & రెస్టారెంట్, జాన్సన్ ఖారా కంపెనీ, ఆల్మండ్ బేకరీ, ఆర్తి ట్రేడర్స్, నేహా ఏజెన్సీస్, శ్రీ భవాని ఖారా & మిక్స్చర్, రెహ్మత్ కార్పొరేషన్, నితిన్ ట్రేడర్స్ సహా లైసెన్స్ లేని మరో 4 సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇండియన్ స్వీట్స్ & సేవరీస్, తాజ్ ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీ, హెవెన్లీ ఖారా మిక్స్చర్ & స్వీట్స్ కేంద్రాలకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
తాజావార్తలు
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!