Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రక్తపాతాలు, విపరీతమైన యాక్షన్ (బ్లడ్ బాత్) సినిమాలతో విసిగిపోతున్న ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన, క్లీన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ను అందించబోతున్నామంటూ యువ హీరో, నిర్మాత రాకేష్ వర్రే సంచలన ప్రకటన చేశారు. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలైన ‘ఎవరికీ చెప్పొద్దు’, ‘పేకమేడలు’ తర్వాత ఆయన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న తాజా చిత్రం ‘మాయలేడి’. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మధుమిత సర్కార్ హీరోయిన్గా నటిస్తోంది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ వర్రే మాట్లాడుతూ.. “పక్కా కమర్షియల్ సినిమా చేయాలనుకున్నా.. అందులోనూ నా స్టైల్ వైవిధ్యం ఉండాలి. అందుకే ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాల తరహాలో ఒక ఫ్యామిలీ, మ్యూజికల్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేశాం. ముఖ్యంగా ‘ఖుషి’ సినిమాలోని ఆ బ్యూటిఫుల్ వైబ్ ఉన్న లవ్ స్టోరీని తెరపై చూసి చాలా కాలమైంది. యాక్షన్ సినిమాలు ట్రెండ్‌లో ఉన్న ఈ టైమ్‌లో నేను పర్సనల్‌గా మిస్సవుతున్న ఆ క్లీన్ లవ్ ఎంటర్టైనర్ను ఎందుకు చేయకూడదు? అని ప్రశంకర్ స్క్రిప్ట్‌తో ముందుకొచ్చాను” అని ఆయన తెలిపారు.
దర్శకుడు ప్రశంకర్ చెప్పిన ఈ స్క్రిప్ట్‌పై తనకు ఎంతో నమ్మకం ఉందని, ఇదొక బ్లాక్ బస్టర్ కొట్టే స్క్రిప్ట్ అని నమ్మి తన సొంత మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించానని రాకేష్ వర్రే ధీమా వ్యక్తం చేశారు. “నా కెరీర్‌కు ఈ సినిమా అత్యంత ముఖ్యం. బ్లడ్ బాత్ లాంటి యాక్షన్ ఫిల్మ్స్ నడుస్తున్న టైమ్‌లో, మా ‘మాయలేడి’ సినిమా థియేటర్లలో హాయిగా నవ్వుకునేలా, ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుందని మీకు కచ్చితంగా ప్రామిస్ చేస్తున్నా” అని ఆయన నమ్మకంతో చెప్పారు. దర్శకుడు ప్రశంకర్ మాట్లాడుతూ.. “ఒక రిలేషన్షిప్లో కోపం, సంతోషం, బాధ ఇలా ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. తన గర్ల్‌ఫ్రెండ్‌లోని డిఫరెంట్ ఎమోషన్స్‌ను క్రిష్ అనే అబ్బాయి ఎలా ఫేస్ చేశాడు అనే పాయింట్‌ను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాం. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మ్యూజిక్, చిన్న మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుంది” అని వివరించారు. తెలుగులో తనకు ఇది మొదటి సినిమా అని, ఈ సినిమాలో తన పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుందని హీరోయిన్ మధుమిత సర్కార్ తెలిపింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, నవంబర్ 13న ‘మాయలేడి’ థియేటర్లలో తన మాయ చేయడానికి సిద్ధంగా ఉంది!
Also Read
- It's a Medical Miracle : కోమా నుంచి లేవగానే అకస్మాత్తుగా సూపర్ పవర్స్.. ఓటీటీలో క్రైమ్ కామెడీ సెన్సేషన్
- Sushmitha Shetty : ప్రేమ కోసం తెలియకుండానే ఆ క్రైమ్‌లో ఇరుక్కున్నా
- Anirudh Ravichander: అనిరుధ్ సక్సెస్ వెనుక ఆ స్టార్ హీరో.. ఐశ్వర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్!
- Kamal Haasan: కమల్ మాస్ లైనప్.. ఒకేసారి అరడజను సినిమాలు!
తాజావార్తలు
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
-
It’s a Medical Miracle : కోమా నుంచి లేవగానే అకస్మాత్తుగా సూపర్ పవర్స్.. ఓటీటీలో క్రైమ్ కామెడీ సెన్సేషన్
-
Story Board : మొన్న అర్నబ్.. ఇప్పుడు మురసు.. ఏపీని వణికించిన వరుస తుపాన్లు..
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..