Sushmitha Shetty : ప్రేమ కోసం తెలియకుండానే ఆ క్రైమ్‌లో ఇరుక్కున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోలతో వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ స్ట్రాటజీతోనే వాళ్ల బ్యానర్ నుంచి వస్తున్న తాజా క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో సుష్మితా శెట్టి హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, తన క్యారెక్టర్ గురించి హీరోయిన్ సుష్మితా శెట్టి చెప్పిన విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
‘దొంగ నా కొడుకు’ అనే టైటిల్ వినగానే చాలా క్యాచీగా, ఫన్నీగా అనిపించిందని సుష్మితా తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ.. “ఇందులో నా క్యారెక్టర్ చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంటుంది. చెప్పాలంటే కొంచెం తింగరి పిల్ల క్యారెక్టర్. హీరో ఈశ్వర్ (మౌళి)ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తుంది. తనను తాను చాలా స్మార్ట్ అనుకుంటుంది. కానీ, అదే అతి తెలివితో తెలియకుండానే చాలా ఇన్నోసెంట్‌గా ఒక క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయిపోతుంది. నేను సీరియస్‌గా స్మార్ట్‌గా ఏదైనా చేయబోతే.. అది కాస్తా తెరపై ఫుల్ కామెడీగా వర్కవుట్ అవుతుంది” అంటూ తన పాత్రపై క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది.
తన మూలాలు కన్నడలో ఉన్నప్పటికీ, పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే అని సుష్మితా శెట్టి తెలిపింది. విదేశాల్లో చదువుకునే రోజుల నుంచే థియేటర్ ఆర్ట్స్ చేసిన సుష్మితకు.. దివంగత అందాల తార శ్రీదేవి అతిపెద్ద స్ఫూర్తి అట. డ్యాన్స్ ద్వారా పలికించే హావభావాలే తనను నటన వైపు నడిపించాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల డ్యాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని మనసులోని మాట బయటపెట్టింది. ఈ సినిమాలో కూడా తను వేసిన ఒక డ్యాన్స్ నంబర్ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
వెండితెరపై లీడ్ హీరోయిన్గా ఇది తన మొదటి సినిమా అని, ఒక నటిగా తనను తాను బిగ్ స్క్రీన్‌పై చూసుకోవడానికి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానని సుష్మితా తెలిపింది. తొలి సినిమాకే ‘మైత్రీ మూవీ మేకర్స్’ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని మురిసిపోయింది. కో-స్టార్ మౌళి చాలా టాలెంటెడ్ అని, దర్శకుడు శ్రీను కంబాలకు ఇది మొదటి సినిమా అయినా సెట్స్‌లో ఏమాత్రం టెన్షన్ లేకుండా చాలా కూల్‌గా సినిమాను తెరకెక్కించారని ఆమె కితాబిచ్చింది.
సంగీత దర్శకుడు సింజిత్ అందించిన మ్యూజిక్ ఈ క్రైమ్ కామెడీకి ప్రధాన బలం అని సుష్మితా పేర్కొంది. భవిష్యత్తులో తనకు ‘మహానటి’ తరహాలో అన్ని ఎమోషన్స్ ఉన్న భారీ పాత్రలతో పాటు స్పోర్ట్స్, రొమాంటిక్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్ చేయాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్న ఈ బ్యూటీ.. నవంబర్ 13న రాబోతున్న ‘దొంగ నా కొడుకు’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని గ్యారెంటీ ఇస్తోంది!
Also Read
తాజావార్తలు
-
Sushmitha Shetty : ప్రేమ కోసం తెలియకుండానే ఆ క్రైమ్‌లో ఇరుక్కున్నా
-
Anirudh Ravichander: అనిరుధ్ సక్సెస్ వెనుక ఆ స్టార్ హీరో.. ఐశ్వర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్!
-
Payal Rajput : టాలీవుడ్‌ను విమర్శిస్తారా? రాధికా ఆప్టే కామెంట్స్‌పై పాయల్ రాజ్‌పుత్ కౌంటర్!
-
Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు
-
Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..