రివ్యూ: కల్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: విశ్వక్ సేన్, గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విశాఖ్ నాయర్ తదితరులు.
- DIRECTOR: దర్శకత్వం : విశ్వక్ సేన్
- MUSIC: సంగీతం : రవి బస్రూర్
- PRODUCER: నిర్మాత : సందీప్ కాకరాల
Cult Movie Review: విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘కల్ట్’. ప్రమోషన్స్‌తోనే సినిమాపై ఆసక్తి ఏర్పడేలా చేశారు. ఈ మూవీ మితిమీరిన హింసతో ఉంటుందని ముందు నుంచే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. దానికి తగ్గట్టుగానే, సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తిని అందరిలోనూ కలిగించింది. విశ్వక్ సేన్ ఒకపక్క హీరోగా నటిస్తూనే, మరోపక్క దర్శకత్వం వహిస్తూ ఏకంగా నలభై మందికి పైగా కొత్త నటీనటులను ఈ సినిమాతో పరిచయం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కల్ట్ కథ:
ఎలాగైనా దర్శకుడిగా ఓ సినిమా చేయాలనే ఉద్దేశంతో, తన ఇద్దరు స్నేహితుల(అనిరుద్, కార్తికేయ)తో కలిసి ఒక నిర్మాత(అనుదీప్)కు కథ చెప్పడానికి వెళ్తాడు ఓ కుర్రాడు. అయితే, సినిమా కథలో హింస సరిపోలేదని, ఇంకా హింసాత్మకమైన కథ ఏదైనా ఉంటే సినిమా తీస్తానని చెప్పడంతో పాటు, పది లక్షల దొంగ నోట్లు ఇచ్చి వాటిని గోవాలో ఖర్చు పెట్టి కథ రాయాలని పంపిస్తాడు సదరు టాలీవుడ్ నిర్మాత. అలా అక్కడికి వెళ్లాక తాము మోసపోయామని తెలుసుకున్న ఆ ముగ్గురు, మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రావాలనుకుంటారు. అయితే, గోవా హోం మంత్రి (మురళీ శర్మ) కొడుకు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) పుట్టినరోజు సందర్భంగా ఒక పబ్‌లో పార్టీ ఇస్తున్నాడని తెలిసి, ఆ పాస్‌లను దొంగిలించి ఆ పార్టీలోకి ప్రవేశిస్తారు. ఆ పార్టీలోకి వెళ్లాక వాళ్లకు ఊహించని షాక్‌లు తగులుతాయి. పార్టీకి హాజరైన వారంతా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. అయితే వాళ్లను చంపుతున్నది ఎవరు? ఎందుకు వాళ్లందరినీ ఒక పబ్‌లో బంధించి చంపాల్సి వచ్చింది? ఈ క్రమంలో డీఎస్పీ సంకల్ప్ నాయక్( విశ్వక్ సేన్) పాత్ర ఏమిటి? ఆ బంధించిన వారందరినీ కాపాడారా? వారిలో ఎంతమంది చనిపోయారు? అసలు ఈ హింస ఎందుకో తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ
ఈ సినిమాని ముందు నుంచి ‘ఇండియాస్ ఫస్ట్ స్లాషర్’ (India’s first slasher) అంటూ సినిమా టీమ్ ప్రమోట్ చేసింది. ప్రమోషనల్ కంటెంట్ చూసినా, ఒళ్లు జుగుప్స కలిగించేలా ఉన్న రక్తపాత సన్నివేశాలు, “ఇదేంట్రా, ఇలాంటి మూవీ చేశారు?” అనిపించేలా ఉన్నాయి. ఇక సినిమా ప్రారంభమైన తర్వాత నేరుగా రక్తపాతంలోకి వెళ్లకుండా, ఒక చిన్న సెటప్‌తో అసలు వీళ్లందరూ ఒక పబ్‌లోకి ఎందుకు వెళ్లారు అనేది ఆసక్తికరంగా చూపించి, ఆ తర్వాత పబ్‌లో రక్తపాతం మొదలుపెట్టారు. అసలు ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, ఎవరిని చంపుతున్నారు, ఎవరెవరు ఎవరెవరిని చంపుతున్నారు అనే విషయాలేవీ అర్థం కాకుండా ఏదేదో జరిగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది.
నిజానికి సుమారు నలభై నిమిషాల వరకు హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఉండదు. ఏదో రక్తపాతం జరుగుతోంది, ఎవరో ఎవరినో చంపుతున్నారు, కానీ ఎందుకు చంపుతున్నారో తెలియడం లేదు అంటూ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్లందరికీ ఇంటర్వెల్ బ్లాక్‌తో కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరో వచ్చారు, వాళ్లని కనిపెట్టి హీరో బయటికి తీసుకెళ్తాడు అనే అంచనాలతో ఫస్ట్ హాఫ్‌కు ఇంటర్వెల్ ఇచ్చాక, సెకండ్ హాఫ్ మొదలవుతుంది.
ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక కూడా అదే కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. కానీ ప్రీ-ఇంటర్వెల్—సారీ, ప్రీ-క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి, ఏదో జరుగుతోంది, అది జరగడానికి కారణం ఏమిటి? అంటూ ఫ్లాష్‌బ్యాక్ చూపించే క్రమంలో ఒక ఆసక్తికరమైన స్టోరీ చూపించారు. ఇంత రక్తపాతానికి కారణం… కరెక్ట్‌గా సెట్ అయ్యింది.
అయితే, ఇంత రక్తపాతాన్ని కామన్ ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేయలేరు. కేవలం మాస్ సినిమాలంటే ఇష్టమున్న వాళ్లు, స్లాషర్ జానర్‌ను ఎక్స్పీరియన్స్ చేయాలని భావించిన వాళ్లకు మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశాలున్నాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, విశ్వక్ సేన్ ఒకపక్క హీరోగా, మరోపక్క దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేసినట్లే అనిపించింది. విశ్వక్ సేన్‌కి ఇలాంటి తరహా పాత్రలు కొత్తేమీ కాదు. అతనికి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. ఆ పాత్రలో విశ్వక్ సేన్ ఇమిడిపోయి నటించాడు.
అలాగే, ముగ్గురు కుర్రాళ్లుగా నటించిన వాళ్లందరూ ఆసక్తికరంగానే నటించారు. వాళ్లలో అనిరుధ్ మాత్రం మంచి మార్కులు సంపాదించాడు. కార్తికేయ సహా మరో కుర్రాడు కూడా మొదటి సినిమాతోనే తమ మార్క్ వేసుకునే ప్రయత్నం చేశారు. అలాగే తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రి భరద్వాజ్ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, సినిమాలో సాంగ్స్ పెద్దగా లేవు. కానీ నేపథ్య సంగీతంతో రవి బస్రూర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లిపోయాడు. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్‌ని సెట్ చేయడానికి బాగా ఉపయోగపడింది. అలాగే, సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా నిర్మించినట్లే అనిపించింది.
అయితే, హీరోని చాలా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో ఇంకేమైనా ఆలోచన చేసి ఉంటే బాగుండేది. ఆ ఇంపాక్ట్ తగ్గి, సినిమా రిజల్ట్ కచ్చితంగా ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది.
ఫైనల్లీ, ‘కల్ట్’.. బ్లడ్‌బాత్ ఓవర్ఫ్లోడ్.. ఇది అందరి కప్ ఆఫ్ టీ కాదు
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!