Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఒక సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపిస్తే ఆ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ సినిమాపై దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారిక ఖాతా ద్వారా ఈ సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ అంచనాలను అమాంతం పెంచేసింది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ ఇతిహాస చిత్రం ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ అని దిల్ రాజు తేల్చి చెప్పారు. రాముడు, సీత పాత్రల్లో రణ్‌బీర్, సాయి పల్లవి ఇద్దరూ పరకాయ ప్రవేశం చేశారని కొనియాడారు. అయితే, వీటన్నింటికంటే ఆయన చెప్పిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది.
అదే ‘రావణాసురుడి’ పాత్ర. రాకింగ్ స్టార్ యష్ తన అద్భుతమైన నటనతో రావణుడి పాత్రను వేరొక స్థాయికి (నెక్స్ట్ లెవెల్) తీసుకువెళ్లాడని దిల్ రాజు ఇచ్చిన ఎలివేషన్ ఈ సినిమాకే హైలైట్‌గా మారనుంది. ఒక స్టార్ హీరో, నెగిటివ్ షేడ్స్ ఉన్న పౌరాణిక పాత్రలో ఎలా అదరగొట్టాడో చూడాలన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ ఎపిక్ డ్రామాను ఇంతటి భారీ కాన్వాస్‌పై, కళ్లు చెదిరే విజువల్స్‌తో తెరకెక్కించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, డైరెక్టర్ నితీష్ తివారీలకు దిల్ రాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఒక అద్భుతమైన కథాకథనానికి తోడు, ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన గూస్బంప్స్ తెప్పించే సంగీతం ఈ చిత్రాన్ని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా (అన్ఫర్గెటబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్) చేస్తుందని ఆయన ప్రశంసించారు. “ఇది మన సత్యం, మన చరిత్ర.. రేపటి నుంచి ఈ అద్భుతాన్ని బిగ్ స్క్రీన్‌పై ఫీల్ అవ్వండి” అంటూ దిల్ రాజు చేసిన ఈ పోస్ట్, రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రామాయణ’ చిత్రానికి భారీ బూస్ట్‌ని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read
- Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
- Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
- Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!
- Jayasudha: ‘మీరు - నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
తాజావార్తలు
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!