Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బాట్స్మెన్ రోహిత్ శర్మ తన ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 39 ఏళ్ల వయసులోనూ చిరుతలా కదులుతూ అద్భుతమైన రనౌట్‌లో భాగమయ్యాడు. న్యూజిలాండ్ ప్రమాదకర బ్యాటర్ డారిల్ మిచెల్‌ను పెవిలియన్‌కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రనౌట్ చూసిన మిచెల్ సైతం ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ ఆడిన బంతి షార్ట్ మిడ్ వికెట్ వైపు వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వేగంగా స్క్వేర్ లెగ్ వైపు పరుగెత్తి బంతిని ఆపాడు. వెంటనే డైవ్ చేస్తూ వికెట్ల వైపు అద్భుతమైన త్రో విసిరాడు. బంతి నేరుగా స్టంప్స్‌కు తగలకపోయినా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ దాన్ని అందుకుని బెయిల్స్ పడగొట్టాడు. దీంతో డారిల్ మిచెల్ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌటయ్యాడు.
Also Read
- Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
- Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
- Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
- Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ఈ రనౌట్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌లో వచ్చిన మార్పుకు నిదర్శనంగా నిలిచింది. గతంలో అతడి ఫిట్‌నెస్‌పై పలుమార్లు విమర్శలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ ఆడగలడా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గత ఏడాదిన్నర కాలంగా రోహిత్ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడి ఆటతీరుతో పాటు ఫీల్డింగ్‌లోనూ చురుకుదనం కనిపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌పై చేసిన ఈ రనౌట్ అందుకు మరో ఉదాహరణగా నిలిచింది.2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు టైటిల్ అందించిన రోహిత్ శర్మ ఆ తర్వాత వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దీంతో రోహిత్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే అతడు తన బ్యాటింగ్‌తో పాటు ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటూ జట్టులో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్.. 2027 ప్రపంచకప్‌లో ఆడటంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. 31 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 27 పరుగులతో, కైల్ జేమీసన్ ఒక పరుగుతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు.
THE BRILLIANCE OF ROHIT SHARMA. 🫡 https://t.co/zks3OtEtag
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 4, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!