స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BLS Polymers IPO Listing: BLS పాలీమర్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో అదిరిపోయే అరంగేట్రం చేసింది. నేడు (నవంబర్ 3) ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు రూ.248 వద్ద లిస్ట్ అయింది. ఇది ఐపీఓ ఇష్యూ ధర రూ.150తో పోలిస్తే 65.33 శాతం అధికం. బీఎస్ఈలో రూ.244.10 వద్ద లిస్ట్ అయి 62.73 శాతం లాభాన్ని అందించింది. ఈ లిస్టింగ్‌తో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.1,514.20 కోట్లకు చేరింది. గ్రే మార్కెట్లో అంచనా వేసిన 46 శాతం ప్రీమియం కంటే వాస్తవ లిస్టింగ్ లాభం ఎక్కువగా నమోదైంది.
ఐపీఓకు భారీ స్పందన
BLS పాలీమర్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 1.19 కోట్ల షేర్లకు గాను 287.05 కోట్ల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. దీంతో ఐపీఓ 241.22 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఎన్ఐఐ విభాగం 559.20 రెట్లు, క్యూఐబీ విభాగం 200.25 రెట్లు, రిటైల్ విభాగం 128.36 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఈ ఐపీఓ అక్టోబర్ 27న ప్రారంభమై 29న ముగిసింది. ఒక్కో షేరుకు రూ.142–150 ధరల శ్రేణిని నిర్ణయించారు. మొత్తం 1.7 కోట్ల ఈక్విటీ షేర్లను పూర్తిగా తాజా ఇష్యూ ద్వారా విక్రయించారు.
Also Read
- IndusInd Bank: ఇండస్ఇండ్ మాజీ సీఈఓపై వేటు.. వేతనం వెనక్కి.. కారణం ఇదే..
- Gold and Silver Prices: గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ పతనం.. వారం రోజుల్లో ఎంత తగ్గిందంటే..?
- EPFO New SWP Scheme: EPFO కొత్త ప్రతిపాదనతో ఉద్యోగులకు ప్రయోజనమా? SWP, ట్యాక్స్ రూల్స్ ఇవే!
- Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా 'రేడియం పౌడర్' మిక్స్..
కొనాలా? అమ్మాలా? హోల్డ్ చేయాలా?
మౌలిక సదుపాయాల రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల వల్ల BLS పాలీమర్స్ ప్రయోజనం పొందే అవకాశం ఉండడంతో.. దీర్ఘకాలిక దృష్టితో షేర్లను హోల్డ్ చేయవచ్చు లేదా కొంత లాభాలను బుక్ చేసుకోవచ్చు. న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ వివిధ పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేక పాలిమర్ కాంపౌండ్లను తయారు చేస్తుంది. విద్యుత్, టెలికాం, రైల్వే రంగాల్లో ఉపయోగించే వైర్లు, కేబుళ్ల ఇన్సులేషన్, కోటింగ్ కోసం వీటి ఉత్పత్తులను వినియోగిస్తారు. అలాగే చమురు, గ్యాస్, నీటి పైప్లైన్లను తుప్పు నుంచి రక్షించేందుకు కూడా వీటిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం గోవాలో 11 ప్రత్యేక యంత్రాలతో తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఎంపిక చేసిన ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ విస్తరణ చేపడుతోంది.
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!