418 Review : 418 రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Chaitra Achaar, Surya Raj Veerabathini , Charan Lakkaraju, Preethi Pagadala, Shree Vaishnav, Shashank Patil, Kota Jayaram, and Goparaju Vijay and others
- DIRECTOR: Keerthan Nadagowda
- MUSIC: Venky GG
- PRODUCER: Mythri Movie Makers
ప్రశాంత్ నీల్ సమర్పణలో 418 అనే సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి అందరిలోనూ అదో రకమైన ఆసక్తి ఏర్పడింది. కీర్తన్ నడగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై మైత్రి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించడం సినిమాకి మరింత ప్లస్ అయింది. అయితే, ఈ సినిమాని ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంది. కానీ, సినిమా సెన్సార్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కన్నడ నటి చైత్ర ఆచార్‌తో పాటు తెలుగు నటి ప్రీతి పగడాల వంటివారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా, సెన్సార్ ఇబ్బందుల కారణంగా రివిజన్ కమిటీ వరకు వెళ్లి, ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, ప్రశాంత్ నీల్ సమర్పణ అనగానే సినిమా మీద అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
418 కధ
Also Read
వేదగిరి అని కర్ణాటకలోని మారుమూల ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఒక ఏడాది ఎన్నడూ లేనంతగా మెడికల్ సీట్లు ఫిల్ అవుతాయి. సరిగ్గా కరోనా సమయం కావడంతో కొత్త నిర్మాణాలు కూడా చేపట్టలేక, గతంలో ఆ హాస్పిటల్ వాడి వదిలేసిన ఒక పాత బిల్డింగుని బాయ్స్ హాస్టల్‌గా మారుస్తారు నిర్వాహకులు. అయితే, 418 నంబరు గల గదిలో ఒక ఆత్మ ఉంది కాబట్టి, ఆ గదిని మాత్రం సీల్ చేసి మిగతా గదులన్నింటినీ అందుబాటులో ఉంచుతారు. అయితే, 417 గదిలో ఉన్న ఇద్దరు కుర్రాళ్లలో ఓ కుర్రాడు ఉన్నపుడు ఆ దయ్యం అతన్ని భయపెడుతుంది. ఆ తర్వాత అసలు ఆ కాలేజీలోనే ఉండకూడదని భావించి వెళ్లిపోబోయిన అతనికి తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గుర్తొచ్చి వెనక్కి వస్తాడు. అయితే అసలు ఆ 418 గదిలో ఏముంది? తాను ఆ దయ్యాన్ని ఎందుకు ఫీల్ అయ్యాడు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఆ కాలేజీ సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. ఈ క్రమంలో అతనికి తెలిసిన నిజాలేమిటి? 418 గదిలో నిజంగానే దయ్యం ఉందా? ఆ కుర్రాడు ఫీల్ అయిన ఆ ఫోర్స్ ఏంటి? అసలు ఈ కథలో దేవకి(చైత్ర ఆచార్) పాత్ర ఏమిటి? యూకే నుంచి వచ్చిన సాయేషా (ప్రీతి పగడాల) పాత్ర ఏమిటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి, తెలుగు కానీ మన సౌత్ లాంగ్వేజస్ లో హారర్ సినిమాలు అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది. మూసివేయబడ్డ గది, మూసివేయబడ్డ బంగ్లా, అక్కడికి ఎవరినీ వెళ్లనివ్వకపోవడం, ఆ తర్వాత ఔత్సాహికమైన ఒక గుంపు లేదా ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి ఆ దయ్యాన్ని మేల్కొలిపి ఎన్నో వింత వింత పనులకు కారణం అవ్వడం—ఇది ఒక ఫార్మాట్లో సాగిపోయే ప్రక్రియ. ఈ సినిమా దానికి భిన్నంగా ఉంటుందని థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు పూర్తి నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే, ఈ సినిమా కూడా పూర్తిగా అదే ఫార్మాట్లో సాగిపోయే సినిమా. వాస్తవానికి, ఈ సినిమా రివిజన్ కమిటీ వరకు వెళ్లింది. హారర్ ఎలిమెంట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్‌తో, ఆ అంచనాలతో ప్రేక్షకుడు థియేటర్లకు వస్తాడు. కానీ వాటిని ఫుల్ ప్లేడ్జ్ గా ప్రేక్షకులకు అందించడంలో ఈ సినిమా తడబడింది.
మరి రివిజన్ కమిటీ ఆంక్షల మేరకు సినిమా నుంచి కొన్ని సీన్స్ కట్ చేశారో ఏమో తెలియదు కానీ, ఒక మూడు, నాలుగు జంప్ స్క్రేర్లు తప్ప ప్రేక్షకులను అంతగా భయపెట్టే అంశాలైతే సినిమాలో ఏమీ కనిపించలేదు. సినిమా ప్రారంభంలోనే ఒక కుర్రాడు మెడికల్ కాలేజీలో చేరడం కోసం అక్కడికి వెళ్తాడు. అక్కడ తన తల్లిని సైతం హాస్టల్ గేట్ దాటి లోపలికి అడుగు పెట్టనివ్వరు. అంతేకాక, అసలు ఆడవాసన కూడా హాస్టల్ గేట్ దాటి లోపలికి రాకూడదంటూ అక్కడ ఆంక్షలు పెడతారు. చుట్టూ క్రియేట్ అయిన పరిస్థితులు సినిమా మీద ఆసక్తి పెంచుతాయి.
ఇక ఆ తర్వాత కథ నెమ్మదిగా సాగిపోతూ ఉంటుంది. అయితే, చాలా తక్కువ లొకేషన్లు కావడంతో కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కథ కూడా ముందుకు వెళ్లడం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే దేవిక అంటూ చైత్ర ఆచార్ పాత్ర ఎంట్రీ ఇస్తుందో, అప్పటితో ప్రేక్షకులకు కథ అర్థమైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. మూఢనమ్మకాల ఆధారంగా ఒక ఆడపిల్ల తన జీవితాన్ని నాశనం చేసుకున్న తీరు అంటూ ఈ సినిమా కథ సాగుతుంది. కాకపోతే, క్లైమాక్స్‌ను అందరి ఊహకు అందకుండా దర్శకుడు ముగించిన విధానం ఎందుకో సరిగా అనిపించలేదు.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో చైత్ర ఆచార్య పాత్ర కీలకం. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు ఆసక్తికరం. ఇక ప్రీతి పగడాల పాత్ర కూడా ఉంది. కొంచెం సేపే కనిపించినా, చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. ఇక మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో అయితే ప్రతి ఒక్క నటి, నటుడు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమా సౌండ్ డిజైన్ ఈ సినిమాకి మెయిన్ హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఆ సౌండ్ డిజైన్ తోనే సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇది చాలా రెగ్యులర్ హారర్ సినిమా, కానీ సౌండ్ డిజైన్ తోనే సినిమా చూస్తున్న ప్రేక్షకులను భయపెడుతూ, ఎంగేజింగ్‌గా తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇక కలర్ ప్యాలెట్స్ కూడా ప్రశాంత్ నీల్ సినిమాలోని ఫీలింగ్ కలిగించేలా ఉన్నాయి. సౌండ్ డిజైన్‌తో పాటు సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్రధానమైన అసెట్ అనే చెప్పొచ్చు. ఇక నిడివి విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉండొచ్చు.
ఫైనల్లీ ఈ 418 .. భయపెట్టింది కానీ?
తాజావార్తలు
-
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
-
Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!