Killer Review: కిల్లర్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2 / 5
- MAIN CAST: పూర్వాజ్. జ్యోతి పూర్వాజ్, చంద్రకాంత్, అర్చన అనంత్, తదితరులు
- DIRECTOR: పూర్వాజ్
- MUSIC: ఆశీర్వాద్ అండ్ సుమన్
- PRODUCER: పూర్వాజ్, పాడీ , పద్మనాభ రెడ్డి
టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కిల్లర్’. గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఆమె భర్త పూర్వజ్ దర్శకత్వం వహించడమే కాకుండా ఓ కీలక పాత్ర కూడా పోషించారు. ఎ. పద్మనాభరెడ్డితో కలిసి పూర్వజ్ ఈ సినిమాను నిర్మించగా.. ఉర్వీష్ పూర్వజ్ సమర్పించారు. “మా సినిమా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌ను ఎవరైతే ముందుగా ఊహించి చెబుతారో వారికి ఏకంగా కోటి రూపాయల బహుమతి ఇస్తాం” అంటూ దర్శకుడు పూర్వజ్ చేసిన భారీ ఛాలెంజ్ సినిమా ప్రమోషన్స్‌లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఈ అంచనాలు, ఆఫర్ల నడుమ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కిల్లర్ కథ:
రక్ష రాయ్ (జ్యోతి పూర్వజ్) అనే యువతిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అటాక్ చేస్తారు. తీవ్ర గాయాలపాలైన ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. ఆమెను కాపాడుకునేందుకు తమ్ముడు కార్తీక్(చందు) ప్రయత్నిస్తుండగా, మరోపక్క పోలీస్ అధికారి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో రక్ష గురించి ఒక్కొక్కరు ఒక్కో విషయం చెబుతుంటారు. అసలు ఆమె ఎవరు? స్పై నా? లేక టెర్రరిస్టా? అనే అనుమానాలు మొదలవుతాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏఐ చిప్‌ను మనుషుల మెదడులో పెట్టి ప్రయోగాలు చేసే సైంటిస్ట్ (పూర్వజ్) ఎంట్రీ ఇస్తాడు. ఏలియన్ ఎలిమెంట్స్ కు, రక్ష మెదడులో ఏఐ చిప్ కు, ఈ దాడులకు అసలు కనెక్షన్ ఏంటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘కిల్లర్’ సినిమా పాయింట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్టాఫ్ అంతా అసలు కథేంటో అర్థం కాక ఆడియన్స్ జుట్టు పీక్కునే పరిస్థితి వస్తుంది. లీడ్ రోల్ చేసిన జ్యోతి పూర్వజ్ క్షణానికో క్యారెక్టర్‌గా మారడం, దానికి తోడు అర్థం పర్థం లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రావడం వల్ల కథనం తీవ్ర గందరగోళంగా మారుతుంది. పోనీ ఇంటర్వెల్ లో అయినా ఏదైనా భారీ ట్విస్ట్ ఉంటుందా? అంటే అదీ పెద్దగా ఆకట్టుకోదు. ఇక సెకండాఫ్‌లో జ్యోతి పూర్వజ్ అలా ప్రవర్తించడానికి గల అసలు కారణాన్ని దర్శకుడు రివీల్ చేసినా, అప్పటికే కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఆ ట్విస్ట్ ఏమాత్రం ఎక్కదు. మేకర్స్ ప్రమోషన్స్ లో ఊదరగొట్టినట్లుగా ఇందులో ‘కోటి రూపాయల ట్విస్ట్’ ఇచ్చేంత రేంజ్ థ్రిల్ అయితే అస్సలు లేదు. దానికి తోడు క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సైతం ఏమాత్రం లాజిక్ లేకుండా సాగడం ఈ సినిమాకి మరో మైనస్. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఒక అద్భుతమైన ఐడియాను, గందరగోళమైన స్క్రీన్ ప్లేతో నీరుగార్చారనే ఫీలింగ్ కలుగుతుంది. ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కు ప్రాణం.. క్లారిటీ ఉన్న స్క్రీన్ ప్లే. కానీ ‘కిల్లర్’ లో అదే అతిపెద్ద మైనస్. కథ స్టార్టింగ్ లో బాగానే అనిపించినా, ఏఐ, మనుషుల మెదడు, ఏలియన్స్ లాంటి పాయింట్స్ రాగానే లాజిక్స్ గాలికి వదిలేశారు. ప్రతి క్యారెక్టర్ ఎవరికి తోచిన కథ వాళ్లు చెప్తుంటే, ఆ సస్పెన్స్ క్రియేట్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ కాస్తా ఆడియన్స్ సహనానికి పరీక్షలా మారాయి.
ఫస్టాఫ్ అంతా డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థంకాక బుర్ర బద్దలవుతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే మెయిన్ ట్విస్ట్ ఏదో కోటి రూపాయల రేంజ్ అన్నారు కానీ, అందులో అంత స్టఫ్ లేదు. ఒక పాయింట్ కు ఇంకో పాయింట్ కు లింక్ కట్ అవ్వడంతో, సినిమా ఎటో వెళ్లిపోయిందనిపిస్తుంది. థ్రిల్లర్ అంటే లాస్ట్ వరకు ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తూ, నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచాలి. కానీ ఇక్కడ ఏ సీన్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. డైరెక్టర్‌గా పూర్వజ్ ఒక మంచి ఐడియాను ఎంచుకున్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం తడబడ్డాడు.
నటీనటుల పనితీరు విషయంకి వస్తే ఈ సినిమాకు ఉన్న ఏకైక హైలైట్ జ్యోతి పూర్వజ్. రక్ష రాయ్ పాత్రలో ఆమె చాలా షేడ్స్ చూపించింది. గ్లామర్ గా కనిపిస్తూనే, యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా అదరగొట్టింది. తన క్యారెక్టర్ లోని డిఫరెంట్ వేరియేషన్స్ ను బాగా పండించింది. అయితే బ్యాడ్ స్క్రీన్ ప్లే వల్ల ఆమె కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక డైరెక్టర్ కమ్ యాక్టర్ పూర్వజ్ ఈ సినిమాలో పోలీస్, సైంటిస్ట్ గా రెండు పాత్రల్లో కనిపించాడు. సైంటిస్ట్ గా పర్వాలేదనిపించినా, పోలీస్ ఆఫీసర్ గా మాత్రం ఆయనకి సెట్ కాలేదు. కార్తీక్ గా చేసిన చంద్రకాంత్ నటన బాగున్నా డబ్బింగ్ సెట్ కాలేదు. మిగతా వారంతా నామమాత్రమే.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే సాధారణంగా థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుంది. కానీ ‘కిల్లర్’ లో ఆ మ్యూజిక్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. డబ్బింగ్, సౌండ్ డిజైన్ కూడా నాసిరకంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ జగదీష్ బొమ్మిశెట్టి పనితీరు మాత్రం బాగుంది. సైన్స్ ఫిక్షన్ వాతావరణాన్ని విజువల్ గా బాగానే ప్రెజెంట్ చేశాడు. కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ కూడా నీట్ గా ఉన్నాయి. అయితే ఎడిటింగ్ మాత్రం దారుణంగా ఉంది. సీన్స్ కు ఒక ఫ్లో లేదు. ఫస్టాఫ్ లో అనవసరమైన ల్యాగ్ తో ఆడియన్స్ కు బోర్ కొట్టించారు.
ఫైనల్ పంచ్: ‘కిల్లర్’. కాన్సెప్ట్ మంచిదే కానీ, ఎగ్జిక్యూషనే?
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!