Anirudh Ravichander: అనిరుధ్ సక్సెస్ వెనుక ఆ స్టార్ హీరో.. ఐశ్వర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anirudh Ravichander: ప్రస్తుతం ఇండియన్ సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కెరీర్ వెనుక ఎవరున్నారన్న విషయంపై గతంలో రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య చేసిన కామెంట్స్ నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ ఫ్యామిలీకి దగ్గరి బంధువైనప్పటికీ, అనిరుధ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి గానీ, ఇంతటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి గానీ తన ప్రమేయం ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ క్రెడిట్ అంతా నూటికి నూరు శాతం కేవలం హీరో ధనుష్‌కే దక్కుతుందని కుండబద్దలు కొట్టారు.
ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఐశ్వర్య నాటి కీలక సంఘటనలను గుర్తుచేసుకున్నారు. “అనిరుధ్ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉండటం చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది. నిజానికి వాడు సినీ పరిశ్రమలోకి రావాలని వాళ్ల పేరెంట్స్ అనుకోలేదు. పైచదువుల కోసం అనిరుధ్‌ను సింగపూర్ పంపించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ సమయంలో ధనుష్ రంగంలోకి దిగి అనిరుధ్‌లోని అసాధారణ సంగీత ప్రతిభను గుర్తించాడు. ‘వీడిలో మంచి సత్తా ఉంది, నన్ను నమ్మండి’ అని అనిరుధ్ తల్లిదండ్రులతో గట్టిగా మాట్లాడి, ఒప్పించి మరీ వాడిని ఇండియాలోనే ఆపేశాడు” అని ఆమె తెలిపారు.
Also Read
- Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు కింగ్ నాగార్జున మద్దతు..
- January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
- Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. 'ఏవోటీ'తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
- Monalisa: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడుంది? పెళ్లి తర్వాత జీవితం ఎలా మారింది?
అనిరుధ్‌ను ఇండియాలో ఆపడమే కాకుండా, సంగీత రంగంలో అతనికి బలమైన పునాది వేసింది కూడా ధనుషేనని ఐశ్వర్య వెల్లడించారు. అనిరుధ్‌కి ఫస్ట్ కీబోర్డ్ కొనివ్వడం దగ్గర్నుంచి.. ‘3’ సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించి సినిమా ప్రపంచానికి పరిచయం చేసే వరకు ప్రతి విషయంలో ధనుష్ అండగా నిలబడ్డాడని చెప్పారు. అలా ధనుష్ పెట్టుకున్న నమ్మకమే అనిరుధ్ నేడు దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగడానికి కారణమైందని ఆమె పేర్కొన్నారు. అయితే ఇంతటి లైఫ్ ఇచ్చిన ధనుష్‌ను.. అనిరుధ్ తన పెళ్లి వేడుకకు పిలవలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారం వెనుక నిజమెంతో తెలియనప్పటికీ.. ఐశ్వర్య గతంలో మాట్లాడిన ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Ravindra Jadeja: జడేజాను పక్కన పెట్టడానికి అసలు కారణం ఇదే.. కోచ్ క్లారిటీ!
-
Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు కింగ్ నాగార్జున మద్దతు..
-
PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
-
Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
-
January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!