Breast Cancer: 17ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే సాధారణంగా 50 ఏళ్లు దాటిన మహిళల్లో వచ్చే వ్యాధి అనే అభిప్రాయం ఉంటుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు రొమ్ములో ఏదైనా గడ్డ కనిపించినా, అది హార్మోన్ల మార్పుల వల్ల వచ్చిందని భావిస్తుంటారు.
ముఖ్యంగా నెలసరి సమయంలో వచ్చే మార్పులుగా తీసుకుని పెద్దగా పట్టించుకోరు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి వయసుతో సంబంధం లేదని కొన్ని కేసులు గుర్తుచేస్తున్నాయి. ఏకంగా 17 ఏళ్ల వయసులో కూడా ఈ క్యాన్సర్ బయటపడిన సందర్భాలున్నాయి.
డాక్టర్ల ప్రకారం చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళలు ఉన్నారు. కొందరికి 19 ఏళ్లకే ఈ వ్యాధి నిర్ధారణ కాగా, మరికొందరికి 22, 25 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బయటపడింది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెద్ద వయసు మహిళలకు మాత్రమే వచ్చే సమస్య అనే అపోహను వదిలేయాలి.
Also Read
మరి ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? మొదటిది రొమ్ములో కొత్తగా గడ్డ కనిపించడం. నెలసరి సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల కూడా గడ్డలు ఏర్పడవచ్చు. అయితే నెలసరి పూర్తయిన తర్వాత కూడా ఆ గడ్డ అలాగే ఉంటే వైద్యులను సంప్రదించాలి. ప్రతి గడ్డ క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ పరీక్ష చేయించుకోకుండా అది సాధారణ సమస్య అని నిర్ణయించుకోవడం ప్రమాదకరం. రెండోది చనుమొనల్లో మార్పులు. వాటి ఆకారం మారడం, లోపలికి మళ్లడం లేదా సాధారణంగా లేని మార్పులు కనిపించడం వంటివి గమనించాలి. మూడోది చనుమొనల నుంచి అసాధారణంగా ద్రవాలు రావడం. ముఖ్యంగా ఎలాంటి కారణం లేకుండా స్రావాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.
నాలుగోది రొమ్ముల ఆకారంలో మార్పులు రావడం. ఒక రొమ్ము పరిమాణం లేదా ఆకారం అకస్మాత్తుగా మారడం, గతంలో లేని తేడాలు కనిపించడం వంటివి గమనించాలి. ఐదోది చర్మంలో మార్పులు. రొమ్ము చర్మంపై గుంతలు పడినట్లు కనిపించడం, చర్మం ఆకృతి మారడం వంటి లక్షణాలు కూడా వైద్య పరీక్షలు అవసరమయ్యే సంకేతాలే.
ఇక చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే అంశాల్లో కుటుంబ చరిత్ర కూడా ఒకటి. కుటుంబంలో తల్లి, సోదరి లేదా ఇతర దగ్గరి బంధువులకు బ్రెస్ట్ క్యాన్సర్ లేదా అండాశయ క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా BRCA1, BRCA2 అనే జన్యువుల్లో మార్పులు ఉంటే ప్రమాదం పెరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో జన్యు పరీక్షలు, నిపుణుల కౌన్సెలింగ్ ద్వారా వ్యక్తిగతంగా ఎంత ప్రమాదం ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఈ జన్యు మార్పులు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ తప్పనిసరిగా వస్తుందని అర్థం లేదు. అంతేకాదు, పొగాకు వినియోగం, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సమస్యలు వంటి జీవనశైలి అంశాలు కూడా ఆరోగ్యపరంగా ఆందోళన కలిగించేవే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్న వయసులో మహిళల్లో రొమ్ము కణజాలం దట్టంగా ఉంటుంది. దీనివల్ల కొన్ని స్కానింగ్ పరీక్షల్లో అసాధారణ మార్పులను గుర్తించడం కష్టమవుతుంది. అందుకే లక్షణాలు కొనసాగుతున్నప్పుడు మొదటి పరీక్షలో స్పష్టత రాకపోయినా వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.
చివరగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఆలోచించడానికి 40 లేదా 50 ఏళ్లు వచ్చే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మీ శరీరంలో వచ్చే మార్పులను గమనించండి. ఏదైనా గడ్డ లేదా అసాధారణ మార్పు కొనసాగుతుంటే వైద్యులను సంప్రదించండి. ప్రతి మార్పు క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న వయసు అనే కారణంతో ఏ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!