Dell 14S: Dell 14S భారత్‌లో లాంచ్.. 2.8K డిస్ప్లే, Intel Core ప్రాసెసర్, Dolby Atmos సపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dell 14S Laptop Launched in India: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ సంస్థ Dell భారత మార్కెట్లో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని Dell 14S పేరుతో పరిచయం చేసింది. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, శక్తివంతమైన పనితీరు, AI ఫీచర్లను కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందిస్తున్నారు. ఇందులో Intel తాజా Series 3 ప్రాసెసర్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వీడియో స్ట్రీమింగ్ సమయంలో గరిష్టంగా 21 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ పేర్కొంది.
Dell 14S ధర, లభ్యత
భారత్‌లో Dell 14S ప్రారంభ ధర రూ.79,990గా నిర్ణయించారు. ఈ ల్యాప్‌టాప్‌ను Dell అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ పార్ట్నర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ల కింద వినియోగదారులు ఈ ల్యాప్‌టాప్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
Also Read
- National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
- Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
- 100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
- ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
Dell 14S స్పెసిఫికేషన్స్
బేస్ వేరియంట్లో:
60Hz రిఫ్రెష్ రేట్
300 నిట్స్ బ్రైట్నెస్
2K IPS డిస్ప్లే
టాప్ వేరియంట్లో:
120Hz రిఫ్రెష్ రేట్
450 నిట్స్ బ్రైట్నెస్
2.8K డిస్ప్లే
రెండు వేరియంట్లలోనూ 16:10 ఆస్పెక్ట్ రేషియో కలిగిన డిస్ప్లే అందిస్తున్నారు. మెరుగైన ఆడియో అనుభవం కోసం Dolby Atmos సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌కు ఆల్-అల్యూమినియం చాసిస్‌ను ఉపయోగించారు. ఈ ల్యాప్‌టాప్ కేవలం 13.5mm మందంతో ఉండగా, దీని బరువు సుమారు 1.15 కిలోలు మాత్రమే. అలాగే ఇందులో 180 డిగ్రీల హింజ్ కూడా అందించారు. కంపెనీ ప్రకారం, ల్యాప్‌టాప్ లిడ్‌ను ఒక్క చేత్తో కూడా సులభంగా తెరవవచ్చు. ఇందులో బ్యాక్లిట్ కీబోర్డ్ కూడా ఉంది.
Dell 14S నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లాంచ్ అయింది
Linen
Dusty Rose
Washed Denim
Velvet Green
పనితీరు విషయానికి వస్తే, Dell 14Sలో Intel Series 3 ప్రాసెసర్ అందిస్తున్నారు. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి Core 5 లేదా Core 7 ప్రాసెసర్ వేరియంట్లను ఎంచుకోవచ్చు. ఆన్-డివైస్ AI టాస్క్‌ల కోసం ఇందులో 17 TOPS వరకు NPU పనితీరు అందిస్తున్నారు. ల్యాప్‌టాప్ బేస్ వేరియంట్లో 8GB LPDDR5X RAM, 256GB స్టోరేజ్ అందుబాటులో ఉండగా, టాప్ వేరియంట్లో, 16GB RAM, 1TB వరకు స్టోరేజ్ అందిస్తున్నారు.
Dell 14Sలో వీడియో స్ట్రీమింగ్ సమయంలో గరిష్టంగా 21 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, దీని ఛార్జింగ్ స్పీడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వీడియో కాలింగ్ కోసం ల్యాప్‌టాప్ ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ Full HD వెబ్‌క్యామ్ అందించారు. అలాగే భద్రత కోసం Windows Hello సపోర్ట్ కూడా ఉంది.
కనెక్టివిటీ ఫీచర్లు
2 × USB-C 3.2 Gen 2 పోర్టులు
యూనివర్సల్ ఆడియో జాక్
HDMI పోర్ట్
Wi-Fi 6E
Bluetooth 5.4
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Dell 14S: Dell 14S భారత్‌లో లాంచ్.. 2.8K డిస్ప్లే, Intel Core ప్రాసెసర్, Dolby Atmos సపోర్ట్
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
IND vs NZ 1st ODI: నేడే భారత్ vs న్యూజిలాండ్ వన్డే.. రో-కో ఎంట్రీపై జోష్.. సిరాజ్ భుజాలపై కీలక బాధ్యతలు..
-
Donald Trump: ఆర్థిక సాయం బంద్.. ఇజ్రాయిల్‌కు ట్రంప్ షాక్!
-
Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!