క్యారెట్: ఇందులో విటమిన్ ఏ, సీ లతో పాటు కెరోటినాయిడ్స్, పొటాషియం వుంటాయి. ఇవి శీతాకాలంలో రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి.

బంగాళాదుంపలు: వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి, శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఉల్లిపాయలు: ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

వెల్లుల్లి: ఇందులోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగాలు దరిచేరకుండా, శరీర రక్షణకు ఎంతో దోహదం చేస్తాయి.

ముల్లంగి: గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కిడ్నీ వ్యాధులు, పైల్స్, కామెర్ల వంటి వాటిని నయంతో చేస్తుంది. ముల్లంగి ఆకుకూరలు మధుమేహానికి ఉత్తమ ఔషధం.

చిలగడదుంపలు: ఇవి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు.. క్యాన్సర్‌తో పోరాడే లక్షణాల్ని సైతం కలిగి ఉంటాయి.

పాలకూర: రక్తహీనత లేదా అనీమియాతో బాధపడే వారికి పాలకూర మంచి ఔషధంలా పని చేస్తుంది. శక్తిని కూడా పెంచుతుంది.

మెంతికూర: ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి, వీటిని తింటే ఉత్తమం. లివర్ సమస్యలను కూడా తొలగిస్తుంది.

పుదీనా: ఇందులో మాంగనీస్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.