RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న #RC17 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ స్పందించారు. ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ (DSP) తో మైత్రీ మూవీ మేకర్స్ కి ఉన్న విభేదాల కారణంగానే ఈ సినిమా నుంచి ఆయన్ని తప్పించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు. “దేవిశ్రీ ప్రసాద్ ఒక స్టార్. ఆయన సామర్థ్యం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇండియా మొత్తాన్ని ఊపేసే మ్యూజిక్ ఆయన ఇవ్వగలరు. ఆయనను తక్కువ అంచనా వేయలేము,” అని రవిశంకర్ అన్నారు.
అయితే, #RC17 నుంచి దేవిశ్రీ ప్రసాద్‌ను ఎందుకు తప్పించారనే ప్రశ్నకు స్పందిస్తూ.. “అది పూర్తిగా డైరెక్టర్ సుకుమార్ గారి నిర్ణయం. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి వస్తారు. అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తాయి,” అని ఆయన తెలిపారు. ఇంతకుముందు సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. కానీ, ఈ సినిమాకు మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కాకుండా వేరే సంగీత దర్శకుడిని ఎంచుకోవాలని సుకుమార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
- Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
తాజావార్తలు
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
-
Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
ట్రెండింగ్
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!