Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smuggling Racket: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ, విదేశీ కరెన్సీని చేతులు మారుస్తున్న ఓ అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రట్టు చేశారు. విజయవాడ కేంద్రంగా సాగిన ఈ భారీ ఆపరేషన్‌లో సుమారు రూ. 5.84 కోట్ల విలువైన విదేశీ బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి.. బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా విదేశీ బంగారాన్ని కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులకు కచ్చితమైన సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ జోనల్ యూనిట్ (HZU), విజయవాడ రీజినల్ యూనిట్ (RU) అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. విజయవాడ శివార్లలో నిఘా పెట్టి అనుమానాస్పదంగా వస్తున్న ఓ స్కార్పియో వాహనాన్ని అడ్డుకున్నారు.
రహస్య అరలో విదేశీ నోట్ల కట్టలు స్కార్పియోను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులోని ఓ రహస్య అరలో భారీగా విదేశీ కరెన్సీ బయటపడింది. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. విజయవాడ శివార్లలోనే బంగారాన్ని డెలివరీ చేశామని, దొరికిన కరెన్సీ ఆ బంగారం అమ్మగా వచ్చిన మొత్తమని వారు అంగీకరించారు. వారి నుంచి 60,000 అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
- Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
- Tiger Shroff Shooting: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దీపావళి టపాసులు అనుకున్నాం..!
- Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
ఆర్టీసీ బస్సులో బంగారం తరలింపు.. టోల్‌ప్లాజా వద్ద పట్టివేత నిందితులు ఇచ్చిన సమాచారంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. బంగారం తీసుకుని హైదరాబాద్ వైపు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు క్యారియర్లను గుర్తించారు. మార్గమధ్యంలోని ఓ టోల్‌ప్లాజా వద్ద బస్సును అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నడుముకు కట్టుకున్న పౌచ్‌లను పరిశీలించగా.. ఒక్కొక్కటి సుమారు కేజీ బరువున్న మూడు విదేశీ మార్కు బంగారు బిస్కట్లు (మొత్తం 3,147.1 గ్రాములు) లభ్యమయ్యాయి. ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన మొత్తం బంగారం, విదేశీ కరెన్సీ విలువ మార్కెట్లో సుమారు రూ. 5.84 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారం కొనుగోలు, రవాణాలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులెవరనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Jio Platforms IPO GMP today: జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే వేటే..!
-
Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!