AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ముమ్మరంగా సాగుతున్న ఎన్నికల సరళి తాత్కాలికంగా ఆగిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన శాంతిభద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనల కారణాల వల్ల అనేకమంది అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారనే వినతులు రావడం ఈ పరిణామానికి ప్రధాన కారణమైంది. నామినేషన్లు సమర్పించలేకపోయిన అభ్యర్థులు అందించిన ఆధారాలు, వినతులను రాష్ట్ర ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించనుంది. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు సంబంధిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు , పోలీస్ ఉన్నతాధికారులు అందించే సమగ్ర నివేదికల ఆధారంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోనుంది.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
- Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్‌తో భారత్ సంప్రదింపులు!
- New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 'ఆటో నగర్ కాలనీ' పేరుతో కొత్త స్కీమ్..
- Nerella Sharada : మహిళల జీవితాలతో ఆటలు.. ఫెర్టిలిటీ కేంద్రాలకు హెచ్చరిక
ఒకవేళ నామినేషన్ల దాఖలుకు అదనపు గడువు పొడిగించాల్సి వస్తే, ఆయా అభ్యర్థులకు కనీసం 48 గంటల వ్యవధి సమయం తప్పనిసరిగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించి గడువును పొడిగించాల్సిన అవసరం ఏర్పడితే, దానికి తగిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
-
Cricketer Nandini : వికారాబాద్‌లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?