Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- రష్యాలో మొదలైన పరిచయం.. ప్రేమగా మారిన బంధం
- ఆరు నెలల తర్వాత ప్రియుడి కోసం భారత్‌కు వచ్చిన జూలీ
- ఆస్తులు, విలాసాల కంటే ప్రేమకే ప్రాధాన్యం
- ఇరు కుటుంబాల అంగీకారంతో నవంబర్‌లో పెళ్లికి సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమకు కులమతాలు, భాష, భౌగోళిక సరిహద్దులు ఎంతో దూరమని మరోసారి నిరూపితమైంది. బిహార్‌కు చెందిన రాహుల్ యాదవ్, రష్యాకు చెందిన జూలీల ప్రేమకథ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ హాట్ టాపిక్‌గా మారింది. ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లిన ఓ సాధారణ యువకుడిని విదేశీ యువతి మనసారా ప్రేమించి, ఏకంగా భారతదేశానికి తరలివచ్చిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆస్తిపాస్తులు, అంతస్తులతో సంబంధం లేకుండా ప్రియుడితో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆమె ముందుకు రావడం పట్ల పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఉపాధి కోసం వెళ్లి మనసు పారేసుకున్న వైనం..
బిహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ బతుకుదెరువు కోసమని రష్యా దేశానికి వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో రష్యా యువతి జూలీతో అతనికి పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాహుల్ తిరిగి భారత్‌కు రావాల్సి వచ్చింది. ప్రియుడు దూరమయ్యాడనే బాధను తట్టుకోలేకపోయిన జూలీ, అతడిని విడిచి ఉండలేనని నిర్ణయించుకుంది. రాహుల్ స్వస్థలానికి వెళ్లాలని నిశ్చయించుకున్న ఆమె, ఆరు నెలల తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా బిహార్‌లోని రాహుల్ ఇంటికి చేరుకుంది.
Also Read
- WBBL 2026: కీపర్ 'నో బాల్' బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
- Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
- How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
- Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
గుడిసెలో నివసిస్తున్నా సరే.. నవంబర్‌లో పెళ్లికి సిద్ధమైన జంట
రాహుల్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వారు ప్రస్తుతం చిన్న గుడిసెలోనే జీవనం సాగిస్తున్నారు. అయితే ఇళ్ల సౌకర్యాలు, విలాసాల కంటే రాహుల్ ప్రేమనే ముఖ్యమని భావించిన జూలీ.. తాను గుడిసెలోనైనా సరే అతడితోనే జీవితం పంచుకుంటానని స్పష్టం చేసింది. విదేశీ యువతి చూపిన ఈ నిజమైన ప్రేమకు రాహుల్ కుటుంబ సభ్యులు కూడా ఫిదా అయ్యారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరి వివాహం నవంబర్ నెలలో అట్టహాసంగా జరగనుంది. భౌతిక దూరాలను, కష్టనష్టాలను లెక్కచేయకుండా నిజమైన ప్రేమ కోసం జూలీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!