Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఆఫర్ బయటకు వచ్చింది. ఏదైనా చేస్తే ఆయన రూటే వేరు అని మరోసారి నిరూపించుకున్నారు. చారిటీలు, ఫండ్స్ అంటూ మధ్యవర్తులకు నిధులు కేటాయించే పాత పద్ధతులకు చెక్ పెడుతూ.. నేరుగా ప్రజలకే కంపెనీ వాటాలు పంచే సరికొత్త విధానానికి తెరలేపారు. వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని ప్రతి పిల్లాడి చేతిలో తన రాకెట్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ షేరు పెట్టబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఏఐ దిగ్గజ సంస్థ ‘ఆంథ్రోపిక్’ తమ కంపెనీలోని 5 శాతం వాటాను ప్రజా ప్రయోజనాల నిధికి ఇస్తున్నట్లు ప్రకటించడమే ఈ రచ్చకు కారణమైందని చెబుతున్నారు. దీనిపై మస్క్ తన ఎక్స్‌లో స్పందిస్తూ సెటైరికల్ పంచ్ వేశారు. “వాటాలను ఏదో పబ్లిక్ ఫండ్‌లో వేయడం దేనికి? నేరుగా ప్రజలకే ఇచ్చేయొచ్చు కదా.. త్వరలోనే నేను కూడా ఇదే చేయబోతున్నా” అని ఫస్ట్ కామెంట్ చేశారు. అన్నట్టుగానే కాసేపటికే మరో పోస్ట్ పెడుతూ.. వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని ప్రతి చిన్నారికీ స్పేస్ఎక్స్ నుంచి ఒక్కో ఫ్రీ షేరు ఇస్తానని బాంబు పేల్చారు.
Also Read
- Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ లే ఆఫ్స్.. డెలివరీ విభాగంలో భారీగా కోతలు..
- Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- DA Hike: ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?
- 14K vs 18K vs 22K Gold: బంగారం స్వచ్ఛత ఎంత? 14K, 18K, 22K మధ్య తేడాలు ఇవే..
ప్రస్తుతం మార్కెట్లో స్పేస్ఎక్స్ ఒక్క షేరు ధర 146.03 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 12,000 పైనే) ఉంది. అమెరికాలో 18 ఏళ్ల లోపున్న పిల్లల సంఖ్య దాదాపు 7.3 కోట్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన పిల్లలందరికీ ఒక్కో షేరు ఉచితంగా పంచాలంటే మస్క్ జేబులోంచి ఏకంగా 10.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 88,000 కోట్లకు పైగా) వెచ్చించాల్సి ఉంటుంది. ఎన్జీవోల ప్రమేయం లేకుండా రాకెట్ కంపెనీ షేర్లను నేరుగా పిల్లలకే ఇవ్వాలన్న మస్క్ ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
ట్రెండింగ్
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!