AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
- స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లపై ఏపీ ఎస్ఈసీ స్పష్టత
- నామినేషన్లకు పోలీస్ ఎన్వోసీ అవసరం లేదని వెల్లడి
- నో డ్యూస్ సర్టిఫికెట్లు కూడా సమర్పించాల్సిన అవసరం లేదు
- ఎన్వోసీ, నో డ్యూస్ పత్రాల కోసం అభ్యర్థులను ఒత్తిడి చేయొద్దని ఆదేశం
- ఈ పత్రాలు లేవనే కారణంతో నామినేషన్ తిరస్కరించవద్దని స్పష్టం
- అవసరమైన మిగిలిన అన్ని పత్రాలు సమర్పిస్తే నామినేషన్ స్వీకరించాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP SEC: రాష్ట్రంలో జరగనున్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల (2026) నామినేషన్ల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పష్టతనిచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు పోలీస్ శాఖ నుంచి ఎన్వోసీ (No Objection Certificate) గానీ, ఇతర శాఖల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు (No Dues Certificate) గానీ సమర్పించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో (SHO)ల నుంచి ఎన్వోసీలు, అలాగే నో డ్యూస్ పత్రాలు సమర్పించాలని రిటర్నింగ్ అధికారులు (ROs), ఎన్నికల అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు రాజకీయ పార్టీలు, పలువురు అభ్యర్థుల నుంచి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై ఏర్పడిన గందరగోళాన్ని నివారించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (రిటైర్డ్ ఐఏఎస్) అధికారిక సర్క్యులర్ (నెం. 1098/SEC-F1/2026) జారీ చేశారు.
Also Read
- Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
- CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
- Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- 12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
ఇందులో భాగంగా.. స్థానిక సంస్థల ఎన్నికల చట్టాల్లోగానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల్లోగానీ పోలీస్ శాఖ ఎన్వోసీ లేదా ఇతర విభాగాల నో డ్యూస్ సర్టిఫికెట్లు సమర్పించాలనే నిబంధన ఎక్కడా లేదని కమిషన్ స్పష్టం చేసింది. అలాగే కేవలం ఎన్వోసీ లేదా నో డ్యూ సర్టిఫికెట్లు సమర్పించలేదనే కారణంతో ఏ ఒక్క అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించవద్దని ఎన్నికల అధికారులను ఆదేశించింది.
అంతేకాకుండా అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం అవసరమైన మిగిలిన అన్ని పత్రాలను సమర్పిస్తే సరిపోతుందని, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన (Scrutiny) ప్రక్రియల్లో గతంలో కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను మాత్రమే కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల ప్రతులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, రిటర్నింగ్ అధికారులతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం నిమిత్తం పంపించారు.
తాజావార్తలు
-
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
-
CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
-
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..