Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunshots Fired: వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్ విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణగా మారింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు, కుర్చీలు విసురుకోవడంతో నందలూరు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. నందలూరుకు చెందిన ఎద్దుల విజయసాగర్‌కు మద్దతుగా టీడీపీ రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, ఎలైట్ ఆస్పత్రి అధినేత డాక్టర్ బాలసుబ్రమణ్యం వర్గం నిలిచింది. మరోవైపు మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గం నుంచి అభ్యర్థి టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు రావడంతో వివాదం మొదలైనట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా పరస్పర దాడులకు దారితీసింది.
ఘర్షణ తీవ్రరూపం దాల్చి పరిస్థితి అదుపుతప్పుతున్న సమయంలో టీడీపీ నేత డాక్టర్ బాలసుబ్రమణ్యం తన వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడున్న వారిలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ మనోజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో మేడా విజయశేఖర్రెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆందోళనకారులు రెండు కార్లకు నిప్పుపెట్టడంతో అవి దగ్ధమయ్యాయి. అలాగే పలు ద్విచక్రవాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఇరువర్గాలు రాళ్లు, కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు నాయకులు, కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
Also Read
- Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
- Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
- CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
- Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అదనపు పోలీసు బలగాలను నందలూరుకు తరలించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో నందలూరులో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కాల్పులు, వాహనాల దహనం వరకు వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
-
Harish Rao : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు
-
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!