Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Jam: దసరా పండుగ సెలవులు ముగియడంతో నగరవాసులు మళ్లీ రాజధాని బాట పట్టారు. పల్లెల్లో వేడుకలు ఘనంగా ముగించుకుని తిరుగు ప్రయాణం కావడంతో హైదరాబాద్‌కు దారితీసే అన్ని ప్రధాన రహదారులు జనసందోహంతో, వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. గురువారం నుంచి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పునఃప్రారంభం కానుండటంతో లక్షలాది మంది ప్రజలు ఒకేసారి నగరానికి తరలివస్తున్నారు. దీంతో శివారు రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65), వరంగల్–హైదరాబాద్ (NH-163) మార్గాల్లో వాహనాలు చీమల దండులా బారులు తీరాయి. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో టోల్‌ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, బీబీనగర్ సమీపంలోని రాయగిరి, గూడూరు టోల్గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. చౌటుప్పల్ సమీపంలో దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.వాహనాల రద్దీ అమాంతం పెరగడంతో పోలీస్, రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీలక జంక్షన్లలో ప్రత్యేక బృందాలను మోహరించారు.చౌటుప్పల్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నారు. వరంగల్, విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వైపు సాఫీగా మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా ఉండేందుకు ఫాస్టాగ్ (FASTag) స్కానర్లను ముందస్తుగానే తనిఖీ చేసి, అదనపు సిబ్బందితో హ్యాండ్‌హెల్డ్ మెషీన్ల ద్వారా ఫాస్ట్‌గా టోల్ రుసుము వసూలు చేసేలా పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర వాహనాలు, అంబులెన్సుల కోసం ప్రత్యేక లేన్లను కేటాయించారు.
మరోవైపు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు సైతం ప్రయాణికుల రాకతో రద్దీగా మారాయి. ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు కూడా ప్రయాణికులతో నిండిపోయి నగరానికి చేరుకుంటున్నాయి. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా వాహనాల రాక మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రధాన మార్గాల్లో గస్తీ ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..