Crazy Kalyanam: క్రేజీ కళ్యాణం రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Tharun Bhascker, Dr. Naresh Vijay Krishna (Naresh), Akhil Raj Uddamari, Kireeti, Anupama Parameswaran
- DIRECTOR: Badrappa Gajula
- MUSIC: Suresh Bobbili
- PRODUCER: Boosam Jagan Mohan Reddy
Crazy Kalyanam: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో, నరేష్ విజయ్ కృష్ణ, తరుణ్ భాస్కర్, అఖిల్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ క్రేజీ కళ్యాణం. ప్రమోషన్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షించింది. ఇక రణబాలి, జైలర్ 2 వంటి సినిమాలతో పోటీ పడుతూ, ఈ సినిమా అక్టోబర్ పదహారో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఒక రోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్‌ను మీడియా కోసం ప్రదర్శించారు. మరి, ప్రమోషన్స్ ఉన్నంత బాగా సినిమా ఉందా? ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
క్రేజీ కళ్యాణం కథ:
Also Read
తెలంగాణలోని మెదక్‌కు చెందిన పర్వతాలు (నరేష్)కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సుజి (మౌనిక)కు బాలరాజు (తరుణ్ భాస్కర్)తో వివాహం చేసి, అతన్ని ఇల్లరికం తెచ్చుకుంటాడు. అయితే, బాలరాజు గజ తాగుబోతు. అనునిత్యం తాగుతూ ఇంటి మీదకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాడు. ఊరిలో పరువు పోతూ ఉందని భావించిన పర్వతాలు, ఎలాగైనా చిన్న కూతురు కీర్తికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే తన అన్న కుమార్తెకు వచ్చిన సంబంధాన్ని తన కుమార్తెకు డైవర్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. ఆ సంబంధం వాళ్లకి కీర్తిని పెళ్లి చేసుకోవడం ఓకే. కానీ, కీర్తి మాత్రం మరోపక్క తనతో పాటు కాలేజీలో చదివే ఉదయ్ (అఖిల్ రాజు)తో ప్రేమలో ఉంటుంది. చదువుకొని గవర్నమెంట్ జాబ్ వచ్చాక, తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకుంటుంది. కానీ, ఈలోపే నరేష్ తెచ్చిన సంబంధం పెళ్లి పీటల వరకు వెళుతుంది. మరి ఈ క్రమంలో కీర్తి తన తండ్రి తెచ్చిన సంబంధం చేసుకుందా? లేక తాను ప్రేమించిన ఉదయ్‌ని పెళ్లి చేసుకుందా? అసలు చివరికి ఏం జరిగింది? కళ్యాణం క్రేజీ కళ్యాణంగా ఎందుకు మారింది? అనేది తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమాని కమర్షియల్ యాంగిల్ లో చూడలేం. ఎందుకంటే, సినిమా మొదలైనప్పటి నుంచే దర్శకుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడనే తాపత్రయం కనిపిస్తూ ఉంటుంది. అసలు అతను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే… ఆడపిల్లలను పెళ్లి పేరుతో ముందరి కాళ్లకు బంధాలు వేయకండి. మగవాళ్లలాగే వాళ్లకీ శక్తి ఉంది. వాళ్లు ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఎదిగే అవకాశం కల్పించాలి. కానీ, పెళ్లి పేరుతో వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇళ్లకే పరిమితం చేయవద్దు అనే మెసేజ్ ఇవ్వాలనే తాపత్రయం కనిపించింది.
ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటి నుంచే బాలరాజు పాత్ర పరిచయం, అతని వల్ల అతని మామ పర్వతాలు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనే విషయాన్ని చూపిస్తూనే, తనకు ఉన్న రెండో కూతురికి మంచి సంబంధం తెస్తే మొదటి కూతురి మొగుడు చేసే అరాచకాలను జనం మరిచిపోతారనే అమాయకపు ఆడపిల్ల తండ్రి పాత్రలో నరేష్ చేసిన మ్యాజిక్ తో ప్రేక్షకులు చాలా వరకు మెస్మరైజ్ అయ్యేలా దర్శకుడు కథ రాసుకున్నాడు. నిజానికి కథగా చెప్పాలంటే, ఇదేమీ కొత్త కథ కాదు. ఇద్దరు ఆడపిల్లలున్న ఓ తండ్రి, పెద్ద కూతురి జీవితం నాశనమైందని భావించి, చిన్న కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకునే ప్రయత్నమే ఈ సినిమా. కాకపోతే, ఆ ప్రయత్నంలో అతను ఎన్ని అడ్డదారులు తొక్కాడు, ఏమేం చేశాడు, చివరికి ఎలా మారాడు అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు.
నిజానికి దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కూడా కొత్తదేమీ కాదు. కానీ, తెలంగాణ నేపథ్యంలో రాసుకుని, దాన్ని కొంతవరకు ఎంగేజ్ అయ్యేలా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విషయంలో ఓ మాదిరిగా సక్సెస్ అయ్యాడు. తను చెప్పాలనుకున్న పాయింట్ చాలా సీరియస్ అయినప్పటికీ, దాన్ని అంత సీరియస్‌గా కాకుండా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా తీసుకురావడంలో కొంతవరకు సక్సెస్ అయినట్లే అనిపించింది. ఇక కీర్తి–ఉదయ్ లవ్ ట్రాక్ కాస్త రొటీన్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త సాదాసీదాగా, నవ్విస్తూ సాగిపోగా, సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా దర్శకుడు రాసుకున్నాడు. ఇక చివరి అరగంట మాత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తూ, నరేష్ ఎమోషన్స్ తో ట్రావెల్ అయ్యేలా దర్శకుడు చేశాడు.
క్లైమాక్స్ ఊహించిన విధంగానే ఉన్నా, ఇచ్చే సందేశం మాత్రం ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక గుణపాఠం అనేలా ఉంటుంది. అయితే, ఇలాంటి ఆలోచనా ధోరణి ఒకప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఉండి ఉండవచ్చు గానీ, ఇప్పుడు ఆ ధోరణి కొంత మారిందేమో అనిపిస్తుంది. అయినా సరే, సినిమా అయితే రిలేటబుల్ గానే ఉంటుంది. ఇక థియేటర్లలో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, OTTలో మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కంటెంట్ అయితే ఉంది. కానీ, సోలో రిలీజ్ విషయాన్ని కూడా సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, కీర్తి అనే మధ్యతరగతి పెద్దమనిషి రెండో కుమార్తెగా అనుపమ పరమేశ్వరన్ ఒదిగిపోయింది. తెలంగాణ యాస ఎలా పలుకుతుందో అనుకున్నాం. కానీ, ఆమె యాసతో పాటు తనదైన శైలిలో నటించి ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో సర్ప్రైజ్ నరేష్. ఆయన నటనకు మిస్మరైజ్ అవ్వని వాళ్లు ఉండరేమో. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ లో ఆయన నటించిన తీరు న భూతో న భవిష్యత్. ఆయనది అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తరుణ్ భాస్కర్ మొదటి నుంచి చివరిదాకా, అసలు ఈ పాత్ర ఎందుకు ఒప్పుకున్నాడా అనే ఫీలింగ్ కలిగించినా, చివర్లో వచ్చే ఒక సీక్వెన్స్ తో మాత్రం ఈ పాత్రకు అతనే కరెక్ట్ అనిపించేలా నటించాడు.
ఇక కీర్తి ప్రియుడి పాత్రలో నటించిన అఖిల్ తన పాత్రకు న్యాయం చేశాడు. బాలరాజు భార్య పాత్రలో నటించిన మౌనిక, టాలీవుడ్‌కి దొరికిన మరో టాలెంటెడ్ నటి అనిపించేలా నటించింది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమా టెక్నికల్‌గా కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి ఫీల్ తీసుకువచ్చింది. నిర్మాణ విలువల్లో ఎక్కడా వంక పెట్టేలా లేదు. పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద కనిపించింది. సురేష్ బొబ్బిలి పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ విషయంలో కూడా మరింత కేర్ తీసుకుని ఉంటే, నిడివి కరెక్ట్‌గా సెట్ అయి ఉండేదేమో.
ఇక ఫైనల్లీ, ఈ క్రేజీ కళ్యాణం ఆలోచింపజేసే ప్రయత్నం..
తాజావార్తలు
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!