Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో జనసైనికులు డీలా..
- జనసేన నాయకులు, కేడర్‌లో అంతర్మథనం..
- బలం చూపించినా పట్టించుకోరా..? అంటూ రగిలిపోతున్నారా..?..
- కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి జనసేన కారణం కదా..? అనే చర్చ..
- సర్దుబాటు అంటే జనసేన కేడర్ సర్దుకుపోవడమేనా..?..
- తాము కనుక పని చేయకపోయి ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడేదా..?..
- గత ఎన్నికల్లో సొంతంగా గెలిచి చూపించామంటున్న జనసైనికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన నేతలు, కార్యకర్తలకు ఆశాభంగం జరిగిందట. ఆశించినన్ని సీట్లు కేటాయించే పరిస్థితి కూటమిలో లేకపోవడంతో కార్యకర్తలు డీలా పడ్డారట. పోటీ చేద్దామని ఉవ్విళ్లూరిన నాయకులు ఉసూరుమన్నారట. ఇటు సీట్లు దక్కక కొందరు… అటు రిజర్వేషన్లు కలసిరాక మరికొందరు అయోమయంలో పడ్డారట. జనసేన నాయకులు, కేడర్‌లో అంతర్మథనం జరుగుతోందట. ఎప్పుడూ పల్లకీ మోయడమేనా..? పదవులకు మాత్రం మనం కనిపించమా..? బలం ఏంటో చూపించినా పట్టించుకోరా..? అంటూ రగిలిపోతున్నారట. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్ షేరింగ్ లెక్కలు ఇంకా తేలలేదు. అయితే… ఒకటి మాత్రం స్పష్టమైంది. జనసేన డిమాండ్ చేసినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదని గల్లీ లీడర్ నుంచి అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది. దాంతో పార్టీ కార్యకర్తల్లో అంతర్గత చర్చలు మొదలయ్యాయట.
క్షేత్రస్థాయిలో బలాబలాలు పరిశీలించడానికి కమిటీలు వేసి, అంత కసరత్తు జరిపి, ఇదిగో మా బలం అని చూపించినా, సీట్లు పెరగలేదంటూ చర్చించుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి జనసేన కారణం కదా అనుకుంటున్నారట. సర్దుబాటు అంటే జనసేన కేడర్ సర్దుకుపోవడమేనా అని నిట్టూర్పులూడుస్తున్నారట జనసైనికులు. పల్లకీలు మోయడమే తప్ప… పల్లకీలో కూర్చునే అవకాశమే రాదా..? అని నిరాశ వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వంలో ఉన్నాం… కలిసి పని చేద్దాం అంటారే కానీ… కలిసి పదవులు తీసుకుందాం అనే మాటలు ఎందుకు రావు..? అని మదనపడుతున్నారట ఆ పార్టీ నేతలు. క్షేత్రస్ధాయిలో తాము కనుక పని చేయకపోయి ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడేదా..? అని ఆగ్రహం, అసహనం, అసంతృప్తి ఏకకాలంలో వ్యక్తం చేస్తున్నారట జనసేన నాయకులు, కార్యకర్తలు. స్థానిక సమరంలో అవకాశాలు దక్కుతాయని ఎదురు చూసినప్పటికీ… నిరాశే మిగిలిందని అంటూ లోలోపల చెప్పుకుని తెగ బాధపడిపోతున్నారట.
Also Read
పార్టీ ఆవిర్భావం నాటి నుంచీ కష్టపడి పని చేశామంటున్నారు జనసైనికులు. గత స్థానిక ఎన్నికల్లోనూ సొంతంగా గెలిచి చూపించామని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడీ పరిస్ధితేంటి అని బాధపడిపోతున్నారట. ఎందుకు ఈ భంగపాటు అని తోటి కార్యకర్తలు, నాయకుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారట. అధిక సంఖ్యలో సీట్లు సాధిస్తామంటూ మీటింగ్‌లు పెట్టి మరీ చెప్పారు. సొంతంగా పోటీ చేసినా చాలా స్థానాల్లో గెలుస్తామని కమిటీలు నివేదికలు ఇచ్చాయి. మరి ఎందుకు తగ్గడం అనే కోణంలో కేడర్ చర్చలు జరుపుతోందట. గత స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపించిన చోట మరోసారి పోటీ చేసి గెలవగలం అనుకుంటున్నారట. మరి జనసేనలో ఈ అంతర్మథనం ఎటు దారి తీస్తుందో..? స్థానిక సమరంలో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు..
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
-
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!