FSSAI: చిన్నారులకు చక్కెర పెడుతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరు నెలల లోపు చిన్నారులకు ఇచ్చే ఆహారంలో చక్కెరల వినియోగంపై భారత ఆహార భద్రతా సంస్థ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. బేబీ ఫుడ్‌లో అదనంగా సుక్రోజ్, ఫ్రక్టోజ్ కలపకుండా ఆంక్షలు విధించాలని భావిస్తోంది. చిన్నారుల ఎదుగుదలలో మొదటి ఆరు నెలలు ఎంతో కీలకం. ఈ సమయంలో వారికి అవసరమైన పోషకాలు అందించడమే ప్రధాన లక్ష్యం. మరి ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు? దీనివల్ల చిన్నారుల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవచ్చు?
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే FSSAI, చిన్నారుల పోషకాహారానికి సంబంధించిన 2020 నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. అక్టోబర్ 16, 2026న ఈ ముసాయిదాను గెజిట్‌లో ప్రచురించగా, అక్టోబర్ 17న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రకటించింది.
ఈ ప్రతిపాదన ప్రకారం 6నెలల వయసు వరకు ఉన్న శిశువుల కోసం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో సుక్రోజ్, ఫ్రక్టోజ్‌ను అదనంగా కలపకూడదు. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయడానికి 60 రోజుల గడువు కూడా ఇచ్చారు. ఇక్కడ సుక్రోజ్, ఫ్రక్టోజ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనం సాధారణంగా ఉపయోగించే చక్కెరలో సుక్రోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ అనేది పండ్లలో సహజంగా లభించే చక్కెర. కొన్ని తయారీ ఆహారాల్లోనూ వీటిని పదార్థాలుగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం చిన్నారుల ఆహారంలో కార్బోహైడ్రేట్ల కోసం లాక్టోజ్, గ్లూకోజ్ పాలిమర్లకు ప్రాధాన్యం ఇస్తారు.
Also Read
- Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
- HIV AIDS: ఎయిడ్స్ మరణాలు పెరుగుతున్నాయా?
- Drought: కరువు భారతం.. తెలుగురాష్ట్రాల్లో మరింత ఘోరం!
- Explainer: మనిషి అహంకారాన్ని కూల్చిన సిద్ధాంతం.. 167ఏళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది?
అవసరాన్ని బట్టి నిర్దిష్ట పరిమితుల్లో సుక్రోజ్, ఫ్రక్టోజ్‌ను కూడా కలిపేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు ప్రతిపాదించిన మార్పు అమల్లోకి వస్తే 6నెలల లోపు శిశువుల కోసం తయారు చేసే ఉత్పత్తుల్లో ఈ రెండు చక్కెరలను అదనంగా కలపడానికి అనుమతి ఉండదు. మరి చిన్నారులకు ఈ వయసులో అదనపు చక్కెరలు ఎందుకు అవసరం లేదనే ప్రశ్న వస్తుంది.
పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలల్లో శిశువుల శారీరక ఎదుగుదల, అభివృద్ధి వేగంగా జరుగుతాయి. ఈ సమయంలో వారి అవసరాలకు తగిన పోషకాహారం అందించడం ముఖ్యం. ఆహారానికి తీపి పెంచడం కోసం అనవసరంగా చక్కెరలను కలపాల్సిన అవసరం లేదన్నది ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. చిన్నారుల్లో ఊబకాయం, భవిష్యత్తులో వచ్చే జీవక్రియ సంబంధిత సమస్యల వంటి ఆరోగ్య ప్రమాదాలను తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో ఇది కూడా ఒక భాగం. ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే బేబీ ఫుడ్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
చిన్నారులకు అవసరమైన పోషకాలు అందేలా చూసుకుంటూనే అదనపు సుక్రోజ్, ఫ్రక్టోజ్ లేకుండా ఉత్పత్తులను రూపొందించాలి. అయితే ఈ మార్పు వల్ల ఆరోగ్యంపై ఎంత మేరకు ప్రభావం ఉంటుందనేది నిబంధనల అమలు, ఆయా ఉత్పత్తుల్లోని పోషకాల కూర్పుపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రతిపాదన మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలనే ప్రజారోగ్య సిఫార్సులకు కూడా అనుగుణంగా ఉంది.
తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కానప్పుడు లేదా వైద్యపరమైన ఇతర కారణాలతో ప్రత్యామ్నాయం అవసరమైనప్పుడు, చిన్నారుల అవసరాలకు తగిన ఇన్ఫెంట్ ఫార్ములాను వైద్య నిపుణుల సలహాతో ఎంచుకోవాలి. ఇంట్లోనే ప్రత్యామ్నాయ ఆహారాన్ని తయారు చేసి ఇవ్వడం కంటే అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
తాజావార్తలు
-
Nero Teaser Controversy: ప్రమోషన్ల కోసమా.. జనాల అటెన్షన్ కోసమా.. ఆ హీరో చేసింది కరెక్టేనా?
-
Vrushakarma టైటిల్‌కు అసలు అర్థం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో చైతూ పాత్ర ఇదేనట!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్‌కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
-
Flight: విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం.. గాల్లోకే తిరిగి వెళ్లిపోయిన ఫ్లైట్..
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!