OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- రగడకు అధిష్టానం ఎలా పుల్ స్టాప్ పెడుతుందో చూడాలి
- పీసీసీ చీఫ్ ఇలాకాలో స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు
- సునీల్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి మధ్య తారా స్థాయికి వర్గపోరు
- భీంగల్ నియోజకవర్గం అయితే అక్కడ్నుంచి పోటీ చేయాలనుకుంటున్న మహేష్ గౌడ్
- బాల్కొండలో గత ఎన్నికల్లో 4533 ఓట్లతో ఓటమిపాలైన సునీల్ రెడ్డి
- బాల్కొండపై కన్నేసిన మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్
- గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ మానాల మోహన్ రెడ్డి
- గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని మోహన్ రెడ్డిపై సునీల్ రెడ్డి ఫిర్యాదు
- తాను పోటీ చేస్తానంటూ పార్టీ పెద్దల సమక్షంలోనే మోహన్ రెడ్డి ప్రకటన
- మోహన్ రెడ్డి ప్రకటనపై పార్టీ పెద్దల మౌనంతో సునీల్ రెడ్డిలో అసంతృప్తి
- సుదర్శన్ రెడ్డి, మహేష్ గౌడ్ల ఆశీస్సులు ఎవరికి ఉంటాయి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్. అందులోనూ బాల్కొండ మహేష్ గౌడ్ సొంత నియోజకవర్గం. పీసీసీ చీఫ్ ఇలాకాలోనే స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిల మధ్య ఇప్పటికే వర్గపోరు తారాస్దాయికి చేరగా… తాజాగా అభ్యర్థిత్వం విషయంలోనూ రగడ మొదలైందట. నియోజకవర్గాల పునర్విభజన జరిగి భీంగల్ నియోజకవర్గంగా ఏర్పడితే… పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ్నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే చర్చ నడుస్తోందట. ఒకవేళ పునర్విభజన జరగకపోతే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆరేంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి అభ్యర్థిగా ఉంటారని అంతా అనుకుంటున్నారట. గత ఎన్నికల్లో కేవలం 4533 ఓట్లతో ఓటమిపాలైన సునీల్ రెడ్డి.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనే బలంగా ఉన్నారట. అయితే, అదే నియోజకవర్గానికి చెందిన డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ సైతం బాల్కొండపై కన్నేశారట. మాజీ ఎమ్మెల్యే అనిల్ ఎమ్మెల్సీ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో… ఆయన పోటీ నుంచి తప్పుకోవడం ఖాయమేనన్న ప్రచారం జరుగుతోందట. మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. అందుకే వచ్చేసారైనా అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ కుర్చీపై ఖర్చీప్ వేసేశారట. నియోజకవర్గంలో తనకంటూ వర్గాన్ని తయారు చేసుకుని పోటీలో ఉంటాననే సంకేతాలు ఇస్తున్నారట మోహన్ రెడ్డి. ఆయన తీరుపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదు సైతం చేశారట. మోహన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడమే మానేశారట సునీల్ రెడ్డి.
అయితే, బాల్కొండపై కన్నేసిన మానాల తగ్గేదేలే అంటున్నారట. పోటీలో ఉంటానని నిన్నమొన్నటిదాకా సన్నిహితుల వద్ద మాత్రమే చెప్పుకున్న మోహన్ రెడ్డి… తాజాగా ఓ కార్యక్రమంలో పార్టీ పెద్దలందరితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమక్షంలోనే వచ్చే ఎన్నికల్లో తాను బాల్కొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకటనతో వేదికపై ఉన్న నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారట. కష్టకాలంలో 10ఏళ్లు జిల్లా అధ్యక్షునిగా పనిచేశానని.. అందుకే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారట మోహన్ రెడ్డి. కార్తీక పౌర్ణమి నుంచి ప్రజల్లోకి వెళ్తానంటూ ఆయన చెప్పడం హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా మారిందట. ఈ ప్రకటనతో సునీల్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారని సమాచారం. మోహన్ రెడ్డి ప్రకటపై పార్టీ పెద్దలు మౌనం వహించటం సునీల్ రెడ్డిని నిరాశపరిచిందట. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి… మోహన్ రెడ్డిని వివరణ అడిగారని సమాచారం. సునీల్ రెడ్డి మాత్రం పీసీసీ చీఫ్‌కు మరోసారి ఫిర్యాదు చేశారట. మోహన్ రెడ్డి ప్రకటన బాల్కొండ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇన్ఛార్జ్ సీటుకే ఎసరు పెట్టాడని కొందరు అనుకుంటూ ఉంటే… మరికొందరు మాత్రం సునీల్ రెడ్డికి పెద్దల అండ ఉందని చెబుతున్నారట. ఎన్నికలకు చాలా నెలలు ఉన్నప్పటికీ… బాల్కొండ అభ్యర్థిత్వం విషయంలో ఇద్దరు నేతల మధ్య పోరు తారా స్థాయికి చేరింది. అయినప్పటికీ నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పెద్దాయనగా పేరున్న సుదర్శన్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బాల్కొండలో అభ్యర్ధిత్వం
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
- OTR : నువ్వు అక్కడ.. నేను ఇక్కడ.. ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్, బీజేపీ సరికొత్త వ్యూహం
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!